Monday, January 18, 2021

ఎన్ని కష్టాలు ఎదురైనా వాటి నుండి దుఃఖం పొందకుండా శాంతిగా ఉండగల మార్గమేది !?

శ్రీరమణీయం

📚✍️ మురళీ మోహన్

🤔ఎన్ని కష్టాలు ఎదురైనా వాటి నుండి దుఃఖం పొందకుండా శాంతిగా ఉండగల మార్గమేది !?

🌊పెద్ద సముద్రం మనని భయపెడుతుంది. కానీ చిన్న నావ మనకి బోలెడు ధైర్యాన్నిస్తుంది. నిజానికి సముద్రం అంటే భయం ఉండదు. అందులో మునిగి పోతామనేదే భయం. నావను చూడగానే సముద్రం అదృశ్యం కాదు. సముద్రమంటే ఉన్న భయం అదృశ్యమవుతుంది. అలాగే మనలను ఆవరించి ఉన్న సంసారం అనే సముద్రం టీవీ చిన్న నావ దొరకగానే సంసారం అక్కడే ఉంటుంది. కానీ సంసారం అనే విషయంలో కలిగే దుఃఖం అంతమవుతుంది. మనకి చాలా సినిమాలు నచ్చేది అందులో కథానాయకుని వ్యక్తిత్వం వల్లనే. నైతిక విలువలతో కష్టాలను భరిస్తూ, సత్ప్రవర్తనతో ఉన్న పాత్ర మనకు సినిమా నచ్చేలా చేస్తుంది. రామాయణ, మహాభారతాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా మనకు ఆ నైతికతనే నేర్పారు. 18 అధ్యాయాల భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది మనసును నిర్మలంగా ఉంచుకోమనే. ప్రతి కాండలో శ్రీరాముడు చూపింది కూడా అదే మనోనిర్మలత్వాన్నే. నిర్మలమైన మనస్సు ఉన్నంత మాత్రాన కష్టాలన్నీ దూరంకావు. కానీ ఏ కష్టం అతన్ని దుఃఖ పెట్టకుండా ఉంటుంది.👍

Source - Whatsapp Message

No comments:

Post a Comment