Sunday, November 21, 2021

జీవిత సత్యం.

జీవిత సత్యం.

ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే.

సముద్రంలో అలలు ఎన్నో. కానీ తీరానికి చేరేవి కొన్నే.

అలాగే జీవితంలో పరిచయమైన వారు ఎందరో...

కానీ మనసుకు హత్తుకునేవారు కొందరే. వారే ఆత్మీయులు.

మన ఆలోచన ఒక విత్తనం లాంటిది. విత్తనం నుండి వచ్చే మొలక పెరిగి పెద్దదై మహావృక్షంగా మారుతుంది.

అంటే విత్తనం మంచిదవడం వల్ల అది పెరిగి మహావృక్షం అయింది.

అలాగే మన ఆలోచనలు మంచివైతే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.

బతికితే శత్రువు కూడా పొగడాలి.
చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అలా జీవించగలిగితేనే సంఘంలో గౌరవం, మర్యాద.

జీవితం మనకు నచ్చినట్లు ఎప్పటికీ వుండదు. అన్నీ సర్దుకొని బ్రతకాలి. నచ్చిందే కావాలి అనుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము.

మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా ఎక్కడ ఉన్నా , రాళ్ళలో మంచి ముత్యం వలె కనిపిస్తుంది.

ఇదే జీవిత సత్యం!

శుభ సాయంత్రం తో మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment