Thursday, November 25, 2021

బుద్ధుని తలపై కనిపించేవి వెంట్రుకలు కావు... మరి ఏమిటి అవి?

బుద్ధుని తలపై కనిపించేవి వెంట్రుకలు కావు...
మరి ఏమిటి అవి?
==============================
అజ్ఞానానికి వెంట్రుకలు ప్రతీకలను కొందరు విశ్వసిస్తారు. వాటిని అజ్ఞానపు కలుపుమొక్కలుగా భావిస్తారు. అందుకే తలపై వెంట్రుకలు లేకపోతే శరీరం, మెడడు స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు. అందుకే బుద్ధిజం (Buddhism) పాటించే వారు తలపై వెంట్రుకలు ఎప్పటికప్పుడు తీసేయించుకుంటారు. చరిత్రను పరిశీలిస్తే.. గౌతమ బుద్ధుడి తలపై కూడా వెంట్రుకలు ఉండవు. తన రాజ భవనాన్ని వీడే ముందు బుద్ధుడు శిరోముండనం (వెంట్రుకలు తీసేయించుకోవడం) చేయించుకున్నాడు.
మరి ప్రతీ బుద్ద విగ్రహం, ఫొటోల్లో ఆయన తలపై వెంట్రుకల్లా.. రింగులు.. రింగులు కనిపిస్తుంది. ఆయనకు రింగుల జుట్టు ఉందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం 108 రింగులు ఉంటాయి.
కానీ అవి వెంట్రుకలు కావు. అయితే మరి ఆయన విగ్రహాలను, ఫొటోలను ఎందుకలా చూపిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది కదా. నిజానికి బుద్ధుడి తలపై ఉన్నది జుట్టు కాదు.. చనిపోయిన 108 నత్తలు.
కథ ఇదే..
అత్యంత వేడిగా ఉన్న ఓ రోజు మధ్యాహ్నం సమయంలో బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం మొదలుపెట్టాడు. ధ్యానంలో మునిగిపోయి ఆయనకు సమయం తెలియలేదు. సమయం గడుస్తున్న కొద్ది ఎండ ఆయన నడినెత్తిపైకి వచ్చింది.
ఆ సమయంలో అటువైపు వెళుతున్న ఓ నత్త (Snail) బుద్ధుడిని చూసింది. తీవ్రమైన ఎండలో ఆయన కూర్చోవడాన్ని గమనించింది. సూర్య కిరణాల వల్ల ఆయన ఏకాగ్రత దెబ్బ తింటుందోమోనని ఆలోచించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా బుద్ధుడి తలపైకి ఆ నత్త ఎక్కింది. శరీరంలోని జలంతో బుద్ధుడి తలను చల్లగా చేసింది. దాన్ని మరిన్ని నత్తలు అనుసరించాయి. అవన్నీ బుద్దుడి తలపై చేరి ఆయనకు చల్లదనాన్ని కలిగించి ధ్యానానికి భంగం కలుగకుండా చేశాయి.
గంటల పాటు ఆ నత్తలు అలాగే బుద్ధుడి తలపైనే ఉన్నాయి. ఆయన ధ్యానం కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే సూర్య కిరణాలు మరింత వేడిగా మారడంతో నత్తలు తీవ్రంగా నీరసించిపోయాయి. వాటి శరీరాల్లోని నీటి శాతం మొత్తం పడిపోయింది. దీంతో ఒక్కొక్కటిగా మరణించాయి. ఆ తర్వాత సాయంత్రం బుద్ధుడు ధ్యానం విరమించే సమయానికి తలపై 108 నత్తలు చనిపోయి ఉన్నాయి. ధ్యానం నుంచి లేచాక ఆయన ఈ విషయాన్ని గుర్తించాడు. తన ధ్యానం కోసం నత్తలు ప్రాణాలు అర్పించాయని అనుకున్నాడు.
బుద్ధుడి కోసం ప్రాణాలు అర్పించిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు. అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్దుడి విగ్రహాలను, ఫొటోలను, చిత్రాలను తయారు చేస్తారు.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment