Tuesday, November 30, 2021

లక్ష్యసాధన

లక్ష్యసాధన

అలారం పెట్టుకుని నీవు ఎప్పుడు లేచావన్నది కాదు. లేచి ఏం చేసావన్నదే ముఖ్యం. 'నేనిది అయి తీరుతాను' అని ఒక లక్ష్యం పెట్టుకోవడం ఒక ఎత్తు. దృష్టి చెదరకుండా దాని వైపుగా మాత్రమే ప్రయాణించడం మరో ఎత్తు. రాముడూ లేస్తాడు ఉదయాన్నే, రావణాసురుడూ లేస్తాడు ఉదయాన్నే. రావణాసురుడు లేచి పరస్త్రీ వ్యామోహంలో వెడితే, రాముడు దైవకార్యం చేయడానికి వెడతాడు.

లక్ష్యం దిశగా నీ ప్రయాణం ముందుకు సాగకుండా వెనక్కి లాగేవి రెండు ఉంటాయి. వాటిలో ఒకటి అహిత శత్రువు, అంటే శత్రువు నీకు కనబడడు. కానీ పక్కన చేరి పాడు చేస్తుంటాడు. అంటే ఎంతో స్నేహితుడిగా కనబడతాడు. కానీ కుట్రలు చేస్తుంటాడు. నీవది గ్రహించేసరికి పుణ్యకాలం దాటి పోతుంది.కలాంగారి మాటల్లోఅంటే విద్యార్థిగా నువ్వొక లక్ష్యం పెట్టుకో. ఏ లక్ష్యం లేకుండా గడ్డిపరకలా బతకొద్దు. మాజీ ఏపీజే అబ్దుల్ చెప్పాలంటే.. "నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఉన్న శక్తి ఇప్పుడు లేదు. అప్పుడు చేసిన మంచి పసులు, అప్పుడు చది విన చదువే ఆధారంగా జీవితం కొనసాగుతున్నది. అప్పుడు చదువుకుని ఉండకపోతే ఇలా నేను మీ ముందుకు వచ్చే సాహసం చేయగలిగి ఉండేవాడిని కాదు. శక్తి నిరుపయోగం కాకుండా ఉండాలంటే ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యమనా అలవోకగా సాధించలేం.
అందుకే చిన్న
లక్ష్యాన్ని పెట్టుకోవడం నేరం అని నాకు అర్ధమయింది' అని అన్నారు. అంటే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటేనే ఎక్కువ శ్రమచేసి దానిమీద దృష్టి పెట్టు కోగలుగుతారన్నమాట.

సర్ ఆర్ధర్ కాటన్ చిన్నత నంలో అన్నయ్యతో కలిసి వీథిలో వెడుతుండగా పెద్ద వర్షంపడి అక్కడక్కడా పెద్ద మడుగులు కట్టింది. 'ఇంటికి త్వరగా వెడదాం' అని అన్నయ్య తొందర పెడుతున్నా కాటన్ ఒక పెద్ద మడుగు దగ్గర ఆగి... ఒకపుల్ల తీసుకుని పల్లం వైపున్న చిన్న చిన్న గుంటలలోకి ఆ మడుగు నీటిని మళ్ళించాడు. తమ్ముడి నిశిత దృష్టిని గమనించిన అన్న ఇంటికి తిరిగి వచ్చిన తరువాత వారి తండ్రికి కాటన్ చేసిన పనిని ప్రశంసాపూర్వకంగా చెప్పాడు. ఆయన కుమారుడిని నీటి పారుదల శాస్త్రంలో ఇంజినీరును చేసారు. ఆ మహానుభావుడే తరువాత కాలంలో ధవళేశ్వరం దగ్గర గోదావరిపై ఒక గొప్ప ఆనకట్ట కట్టి తూర్పు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాల్లో బంగారం పండడానికి కారణ మయ్యాడు.

ఇద్దరు శత్రువులు: మీరు లక్ష్యసాధన దిశగా వెళ్ళేటప్పుడు మీరు ముందుకు వెళ్ళకుండా ఆటంకపరిచేవి రెండుంటాయి. అవి హిత శత్రువు, అహిత శత్రువు. ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అహిత శత్రువు- అది శత్రువని తెలిసిపోతూనే ఉంటుంది. తెలిసి కూడా ప్రమాదం చేస్తుంది. హిత శత్రువు మనిషిని ఆకర్షించి నాశనం చేస్తుంది.

అకాలంలో అనవసర విషయాలజోలికి వెళ్ళడం అంటే జీవితాలను పాడు చేసు " కోవడమే. అక్కరలేని వయసులో సెల్ఫోన్. అర్ధంలేని మెసేజ్లు, వీడియోలు చూసు కోవడం, పనికిమాలిన గ్రూపుల్లో ఉండడం. ఏ లక్ష్యం లేకుండా అస్తమానూ వీధుల " వెంట తిరగడం... ఏ పనీ లేదు కాబట్టి పక్కింటివాడిని కలిసి కబుర్లాడడం... కాసేపు ' మంచి పుస్తకం ఎందుకు చదువుకోవు? మంచి విషయాలు ఎందుకు ధ్యానం చేయవు? నీ చదువు నీవు చదుకుకుంటూ కూడా నీ మనసుకు నచ్చిన మంచి హాబీలు.. వీటిని విలాస విద్య లంటారు. వీటిని అభ్యాసం చేయవచ్చు. నీ చదువు నీవు చదువుకుంటూ... ఒక మృదంగం ఒక వేణువాయిద్యం, ఒక కర్ణాటక సంగీతం... అలా ఏదయినా అభ్యసించవచ్చు.

ఒకప్పడు ఆంధ్రా మెడికల్ కాలేజిలో ఆచార్యుడు, గొప్ప వైద్యుడు అయిన శ్రీపాద పినాక పాణి గారు సంగీతంలో నిష్ణాతుడై చాలా పేరు ప్రఖ్యాతులు గడించాడు. చిట్టచివరకు మహావృద్ధుడై మరణశయ్యపై ఉండి కూడా నేదునూరి కృష్ణమూర్తిగారిలాంటి విద్వాంసులు, పలువురు శిష్యులు ఆయన మంచం పక్కన నిలబడి కీర్తనలు పాడుతుంటే వింటూ ప్రాణత్యాగం చేసారు. ఆయన ప్రఖ్యాత వైద్యుడయికూడా విలాసవిద్యను కష్టపడి నేర్చుకుని అంత స్థాయికి ఎదిగారు. అందుకే మనిషి తనను ఆకర్షించి పాడుచేసే వాటి వైపుకి వెళ్ళకూ డదు. నిగ్రహించుకోగలిగే శక్తి ఉండాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment