Tuesday, November 30, 2021

"మార్ష్ మెల్లో సిద్ధాంతం" ప్రకారం, ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్యలక్షణాలతో పాటు ఓర్పుని కలిగి ఉంటారు.

ఒక పరీక్ష

స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని మిఠాయి పంచి, ఒక విచిత్రమైన షరతు పెట్టాడు.

"వినండి పిల్లలూ! మరో పది నిమిషాల వరకు మీరందరూ మీ మిఠాయి తినకూడదు" అని చెప్పి తరగతి గది నుండి వెళ్లిపోయాడు.

క్లాస్‌రూమ్‌లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది.

పిల్లలందరూ తమ ముందు ఉంచిన మిఠాయి వైపు చూస్తున్నారు, గడిచే ప్రతి క్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవటం చాలా కష్టంగా ఉంది.

పది నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూమ్ లోకి ప్రవేశించారు.

అతను పరిస్థితిని సమీక్షించాడు.

మొత్తం క్లాస్ లో మిఠాయిలు తిననివారు ఏడుగురు పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు, మిగిలిన పిల్లలందరూ మిఠాయి తినేసి, దాని రంగు, రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు.

ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ ఏడుగురు పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి, బోధన ప్రారంభించాడు.

ఈ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిషెల్.

కొనేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ ఏడుగురు పిల్లల పేర్లను బయటకు తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు.

ఈ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు.

అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశాడు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్థికంగా, సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు.

వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంలో ముగించాడు –

" కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి, జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు."

ఈ పరిశోధన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది.

ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి, "మార్ష్ మెల్లో" అవడంవల్ల, ఇది "మార్ష్ మెల్లో సిద్ధాంతం" అని పిలువబడింది.

ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్యలక్షణాలతో పాటు ఓర్పుని కలిగి ఉంటారు.

ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహనశక్తిని పెంచుతుంది కాబట్టి, అతను ప్రతికూల పరిస్థితులలో కూడా నిరుత్సాహపడడు.
తనకు తానుగా ప్రేరేపించుకుంటూ, విజయవంతమైన వ్యక్తి అవుతాడు.

సేకరణ

No comments:

Post a Comment