Sunday, August 7, 2022

"అసలునేను, దొంగనేను" ఏమిటి ? రెండు నేనులు లెవ్వంటారు కదా !?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"298"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

    

*"అసలునేను, దొంగనేను" ఏమిటి ? రెండు నేనులు లెవ్వంటారు కదా !?"*

*****


*"నిజానికి ఉన్నది ఒక్కనేనే. అయితే సాధకునికి అనుభవం రాని వరకు ఈ భావనలు వదలవు. మనలో శాంతిగా ఉన్న ఆత్మభావనే అసలైన 'నేను'. ఇంద్రియానుభవంతో మనకి కలిగే శరీరభావనే 'దొంగనేను'. మనకి ఆ లోపలవున్న అసలునేను తెలియకపోయినా బయట కనిపించే దొంగనేను తెలుస్తూనే ఉంది. మనకి తెలిసిన బయటినేనుతో చేసే ఆధ్యాత్మిక సాధనతోనే, తెలియని లోపలినేను అనుభవంలోకి వస్తుంది. నిద్రలో సద్దుమణిగిన ఇంద్రియాలు, నిత్యజీవితంలో తిరిగి విజృంభించటం వల్లనే ఆ శాంతి దూరం అవుతుంది. స్విచ్ ఆపిన టీవీ అప్పటికి తన కార్యకలాపాలను ఆపినా మళ్ళీ స్విచ్ వేస్తే తిరిగి తన పనులన్నింటినీ యధాతథంగా కొనసాగిస్తుంది. మన నిద్రకూడా అలాంటిదే. నిద్రలో ఇంద్రియాలు లేవు కనుక నేను అనే భావనలేదు. కానీ అక్కడే మనం శాంతిగా ఆత్మస్వరూపంలో ఉన్నాం !"*


*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

          🌼💖🌼💖🌼

                🌼🕉🌼 

No comments:

Post a Comment