Monday, August 8, 2022

దైవాన్ని_కోరిక_ఎలా_కోరాలి

 🕉️🕉️🕉️#దైవాన్ని_కోరిక_ఎలా_కోరాలి 🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🔱 👉నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి అంటే, ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది..

🔱 👉నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే, నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది..

🔱 👉నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే, నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..

🔱 👉నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే, నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ/పతి భాగస్వామి అవుతుంది..

🔱 👉నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి, దర్శనానికి రావాలి అంటే, నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..

🔱 👉భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే, నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం..

🔱 👉కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే, నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబంలో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..

🔱 👉చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే, భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..

👉మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది..

🔱👉 ఓం నమో దుర్గాయ నమః 🚩🔱

సర్వలుకు సన్మంగళానిభవంతు

శుభంకలుగుగాక 🚩🚩 

No comments:

Post a Comment