Monday, August 8, 2022

ఇంద్రియాలను నియంత్రించుకునే విధానం ఏమిటి ?

 🙏🕉🙏 ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"300"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖


*"ఇంద్రియాలను నియంత్రించుకునే విధానం ఏమిటి ?"*

******


*"ఇంద్రియాలను నియంత్రించుకోవాలంటే వివేకం కావాలి. మనకు ఏది అవసరమో, ఏది అనవసరమో గుర్తించాలి. అంటే మనబుద్ధి సక్రమంగా పనిచేయాలి. నిజానికి ఆత్మానుభవం బుద్ధిస్థాయికి మించిందే అయినా ఆ బుద్ధిని బుద్ధికుశలతతోనే దాటగలం. కనుక బుద్ధిని బాగుచేసుకోవటం చాలాముఖ్యం. బుద్ధి అంటే మంచి చెడుల వివేచన. అది కలిగిన రోజు చెడును వదిలి మంచిని మాత్రమే స్వీకరించగలుగుతాం. మనకి ఆత్మ గురించి ఏ జాగ్రత్తలు అవసరం లేదు. కానీ ఆ ఆత్మ తెలియాలంటే బుద్ధి విషయాలలో చాలా జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన సచ్ఛీలమంతా బుద్ధిపైనే ఆధారపడి ఉంది. ఇంద్రియాల ద్వారా ఏ చెడు జరగకూడదన్న సూచననే మన పెద్దలు చెడుఅనకు, చెడువినకు, చెడుకనకు, చెడుతినకు, చెడుఅంటుకోకు అనిచెప్పారు "!*


*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

           🌼💖🌼💖🌼

                 🌼🕉🌼 

No comments:

Post a Comment