Sunday, August 7, 2022

ఆత్మానుభవానికి, ఇంద్రియాల పనులకు సమన్వయం ఎంతవరకు ఉంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*
       💖💖 *"299"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"ఆత్మానుభవానికి, ఇంద్రియాల పనులకు సమన్వయం ఎంతవరకు ఉంది ?"*
******
*"ఆత్మానుభవం జరగాలన్నా, దైవదర్శనం కావాలన్నా మనం ఇంద్రియాల ద్వారా జరిగే పనులను నియంత్రించాలి. ఆధ్యాత్మికత వైపు ఇష్టం బలపడితే మన మనసు తెలియకుండానే ఇంద్రియ వ్యాపారం తగ్గించు కుంటుంది. ఆ స్థితి కలిగే వరకు మనమే ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాల పనులను నియంత్రించుకోవాలి. మన ప్రతి అనుభవానికి ఇంద్రియాలు కారణం. ఇంద్రియాలు లేని సుఖాన్ని, దుఃఖాన్ని మనం ఊహించలేం. శాంతిగా ఉన్న 'లోపలి నేను' గురించి మనకి ఏ దిగులూ లేదు. ఆ శాంతిని మనం అనుభవించకుండా చేస్తున్న ఇంద్రియాలే సమస్యగా ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలను జాగ్రత్తగా వాడుకోవాలి. దుఃఖం కలుగుతుంది 'బయటి నేను'కే కనుక పరిష్కారం కూడా దాని విషయంలోనే అవసరం. ఇంద్రియాలు ఏ అనుభవాన్ని అందించని నిద్రలో, అసలు నేను తాలూకూ శాంతిని మనం అనుభవిస్తున్నాం. ఈ శాంతి మనకు నిరంతరం అందాలంటే ఇంద్రియాల పనులను ఆపాలి. జీవనంలో ఇంద్రియాలను పూర్తిగా ఆపటం ఎవరికి సాధ్యంకాదు. కనుక వాటి కార్యకలాపాలను వీలైనంత తగ్గిస్తే, మనలోని శాంతి క్రమేణా వ్యక్తమవుతుంది. అంటే అనవసర విషయాల్లో ఇంద్రియాల వ్యాపారం, వ్యాపకం తగ్గిస్తే సరిపోతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
            🌼💖🌼💖🌼
                  🌼🕉🌼 

No comments:

Post a Comment