*🕉️నమో భగవతే శ్రీ రమణాయ*🙏🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి*
"మనస్సు చాలా కాలంగా ఇతరుల పొలాల్లో దొంగతనంగా మేయటానికి అలవాటుపడిన ఆవు లాంటిది, అది తన స్ధావరానికి (గోశాలకు) అంత తేలికగా పరిమితం కాదు . పశువుల కాపరి దానికి మృదువైన గడ్డి మరియు మంచి మేతతో ప్రలోభపెట్టినా మొదటి సారి అది నిరాకరిస్తుంది. తర్వాత మెల్లగా అది కొంచెం కొంచెంగా తీసుకుంటుంది, కానీ అది తన అంతరంగంలో మటుకు దూరంగా వెళ్లి పక్క పొలాల్లో మేయాలనే స్వభావ ధోరణి ఒత్తిడికి లొంగిపోతుంది. యజమాని ద్వారా పదేపదే ఊరించబడిన తర్వాత ఆ ఆవు అలవాటు పడి క్రమంగా గోశాల కే పరిమితమవుతుంది. వదిలి వేసినా పారిపోని స్ధితికి వస్తుంది.
*అంటే ఒక్కసారి తన అంతర్గత ఆనందాన్ని కనుగొంటే అది బయటికి పరుగులు తీయదు."*
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏
No comments:
Post a Comment