Thursday, May 23, 2024

మానవునికి మరు జన్మ అంటూ వుంటుందా???

 *మానవునికి మరు జన్మ అంటూ వుంటుందా???*

ఎవరికీ ఏమీ ఇయ్యని కారణముగా మానవుడు దరిద్రుడై పుడతాడు. 
దరిద్రుడై పుట్టి జీవనము కొరకు చేయరాని పనులు చేస్తూ పాపమును ప్రోగు చేసుకుంటాడు. 
పాప ఫలితమున ఘోర నరకమున పడి భయంకర శిక్షలను అనుభవించి మరలా దరిద్రుడై పుట్టి మరలా పాపాలను చేస్తాడు.. 
ఈ చక్రం అనంతముగా తిరుగుతూ ఉంటుంది... 
కనుక ఉన్నంతలో ఎంతో కొంత పేదలకు, దీనులకు పంచి పెట్టాలి. 
మన శక్తి మేరకు పరులకు సహాయ సహకారాలు అందించాలి. 
భగవంతుడు ఏ రూపము ధరించైనా మన సహాయాన్ని కోరి రావచ్చును. 
మనుష్య రూపం లేదా జంతువులు, పక్షులు ఇలా ఏ రూపంలోనైనా ఆయన మనలను పరీక్షించవచ్చును. అన్నింటికీ మనం సిద్ధపడి ఉండాలి. 
సహాయం చేయగలిగే స్తోమత ఉండి కూడా ఎవరికి కాదు, లేదు అనకూడదు. 
ఎవరికి ఏ సహాయం చేసినా అంతా  భగవంతునికే చెందుతుంది అనే భావనతో చేయాలి. 
అదే నిజమైన దైవ సేవ, నిజమైన దైవ సేవ చేసినవాళ్లకు మరుజన్మ అంటూ ఎదీ ఉండదు.

No comments:

Post a Comment