Sunday, September 1, 2024

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...* *అందుకు గల కారణాలు:

 *కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...*

*అందుకు గల కారణాలు:*

1. *అతి తెలివి,గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.*

2. *చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.*

3. *పిల్లలు,పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకో లేకపోవడం .*

4. *ఎక్కువ సమయం TV, ఫోన్లు,ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో,హీరోయిన్లు ఏం తిన్నారో,ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు)*

5. *చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.*

6. *ఎవరో ఒకరి నోటి దురుసుతనం, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.*

7. *ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోక పోవడం*

8. *భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...*

9. *మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.*

10. *మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.*

11. *కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.*

12. *మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది.భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.*

13. *social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.*

14. *ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.*

15. *ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప,ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి...*

*ఇదే పరిస్థితి కొనసాగితే,అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు,అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో...*
🤔😊🤔 😊🤔😊 🤔😊🤔

          #జాగో హిందూ జాగో 
        # *భారత్ మాతాకీ జై*#

No comments:

Post a Comment