Wednesday, June 11, 2025

 [6/11, 10:26] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


సాధువులగు జంతువులకు
బాధలు గావించు ఖలుల భంజింపని రా
జాధము నాయుస్స్వర్గ
శ్రీధనములు వీగి బోవు సిద్ధము తల్లీ.
                *-పోతన*

*భావం :-* తల్లీ! సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైనవాడు తప్పక శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన
అధముడైన రాజు జీవితం ఆయుష్షు, ఐశ్వర్యం అన్నీ వ్యర్థం అనేమాట నిజం.
[6/11, 10:26] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


ఆలోచన లేని స్పందన
అవగాహన లేని విమర్శ
సంపాదన లేని ఖర్చు
ప్రయత్నం లేని ఓటమి
వీటి వల్ల జీవితంలో
అతి ముఖ్యమైన వాటిని
కోల్పోవాల్సి వస్తుంది.
[6/11, 10:26] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*ఇల్లు కట్టి చూడు పెళ్ళిచేసి చూడు*

ఇల్లు కట్టినా, పెళ్ళి చేసినా ఆర్థికంగా దెబ్బ తినడము సహజమని ఈ సామెతకు అర్థం.


*ఇల్లెక్కి కొరివి త్రిప్పినట్లు*

అమాయకుల నుద్దేశించిన సామెత ఇది. ఇల్లెక్కి కొరివి తిప్పితే ఇల్లు కాలిపోతుందని తెలియక ఒక అమాయకుడు ఆ పనిచేశాడట
[6/11, 10:26] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*ఓ బొజ్జ గణపయ్య*


ఓ బొజ్జ గణపయ్య - నీ బంటు నేనయ్య
కమ్మని నెయ్యయ్య - కందిపప్పయ్య
పేరిన నెయ్యయ్య - పెసర పప్పయ్య
ఎలుక వాహనమదీ - ఎక్కిరావయ్య
ఉండ్రాళ్ళ మీదకి - దండు బోవయ్య
[6/11, 10:26] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*చిటపటలు*

కోపతాపాలు, 
అల్లరులు . 
వంటకోసం పొయ్యిలో రాజేసిన మంట సజావుగా వెలుగుతూ ఉంటే వంట త్వరగా అయిపోతుంది.మంటకు బదులు చిటపటమంటూ నిప్పురవ్వలు వెలువడుతూ ఉంటే ఇబ్బంది.
[6/11, 10:26] +91 79819 72004: *☑️ తెలుసుకొందాం ✅*



*🐡మిలమిల మెరిసే మిణుగురు చేపలు కథ ఏమిటి? Florocent Fish story What?*

చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు... కానీ మిణుగురుల్లా... రాత్రి పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్‌ ఫిష్‌!

అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? తైవాన్‌లో సందడి చేస్తున్నాయి. మరి ఇన్నాళ్ల నుంచి ఎందుకు మన కంటపడకుండా తిరిగాయబ్బా? ఏ సముద్రం అడుగునో దాక్కున్నాయా? కాదు. ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. ఇంతకీ ఎందుకీ ప్రయోగం? ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది.

సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్‌ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి, వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. అంటే ఇప్పుడు వీటి పేరు ఏంజెల్‌ ఫ్లోరోసెంట్‌ ఫిష్‌ అన్నమాట. తైవాన్‌లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. మరి ఈ ప్రయోగాలు అంతక్రితం ఏవీ జరగలేదా? నిజానికి 2001లోనే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. తర్వాత ఏడేళ్లు శ్రమించి ఏంజెల్‌ చేపల శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట. మరి వీటిని వండుకుని తినచ్చా? ఓ నిక్షేపంలా. మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే ఎక్కువ. ఒక్కోటి రూ.1300 పలకొచ్చని అంచనా. ఇంకో రెండేళ్లలో వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు.

మీకు జెల్లీ ఫిష్‌ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్‌ మాంసకృత్తులే. దాన్ని వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు... ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్‌ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.

No comments:

Post a Comment