Tuesday, June 17, 2025

 712a6;171c5;27c4;192d6;176e5;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *గురువు యెుక్క ప్రేమ!*
                ➖➖➖✍️

*1). విహంగ న్యాయం:-*

పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.

అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)


*2). భ్రమర కీటక న్యాయం:-*

భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది.
అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.
(వాక్కు మధురంగా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు)


*3). మీన న్యాయం :-*

చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది.  తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి.

 ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడంవల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.


*4). తాబేటి తలపు న్యాయము :-*

తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి  ఆహారానికి వెళుతుంది.  ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది'.            ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి.

అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను ‘పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి!’ అని సద్గురువు 'సంకల్పిస్తారు'.

*ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.*✍️
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment