*_నువ్వు అనుకోవాలి కానీ నిన్ను పడగొట్టే కష్టం సైతం నిన్ను నిలబెట్టే సాధనం అవుతుంది._*
*_ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది._*
*_"ప్రయత్నించే వాడికి ఏదీ కష్టం కాదు. ప్రయత్నిస్తేగానీ ఎవరి అదృష్టం వారికి తెలీదు."_*
*_నీ విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళతో పంచుకో, వాళ్ళు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్ళతో పంచుకో, ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నేర్పిస్తారు._*
*_సహనం అనేది చేదుగా ఉండే చెట్టు కానీ తీయని పండ్లను ఇస్తుంది. సహనానికి ఫలితం శాంతం... తొందరపాటుకు ఫలితం పశ్చాత్తాపం. సహనం, తొందరపాటు అనేవి పరస్పర వ్యతిరేకమైనవి._*
*_సహనం మనల్ని మానసికంగా బలవంతులుగా చేస్తుంది... తొందరపాటు బలవంతంగా మనకు మతిస్థిమితం లేకుండా చేస్తుంది. మన అసహనాన్ని మనలోనే ఎక్కువ సేపు దాచుకోగలిగే కళే సహనమంటే.!!_*
*_కోట్లు కూడబెట్టి కడుపునిండా తినలేని వారి కంటే, కష్టాన్ని నమ్ముకొని, కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు._*
*_గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళకంపను మంచినీళ్ళతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడ అంతే... మన జీవితం మనకేదీ నేర్పించదు... జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి._*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌵🌈🌵 🌍🙇♂️🌍 🌵🌈🌵
No comments:
Post a Comment