*_జీవితంలో పొందిన సహాయాన్ని... సమయంలో ఆదుకున్న వ్యక్తిని మర్చిపోకూడదు._*
*_అవసరం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ పరిస్థితి మనకు ఎలా దాపురిస్తుందో కూడా తెలియదు. అలాంటి సమయంలో మనలను ఆదుకున్న వ్యక్తిని మర్చిపోతే కృతజ్ఞత ఎలా అవుతుంది.?_*
*_పరిస్థితులు ఎలా ఉన్నా... ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్న కనీసం... నీవు అనుభవిస్తున్న పరిస్థితులను చెప్పడానికి ప్రయత్నించు కానీ, మొఖం చాటేయ్యకు..._*
*_అవసరంలో తీయగా మాట్లాడుతూ, లేని ప్రేమను వలకబోస్తూ... అవసరం తీరాక గొంతు కోసే రకం ఉన్నారు ఈ లోకంలో..._*
*_అవసరానికి వాడుకునే బంధువుల కన్నా అవసరములో ఆదుకునే ఆత్మబంధువులు మిన్న._*
*_అవసరం, అవకాశం ఎంతటి ఘోరానైనా, నటననైనా, ఎంతటి నీచానికైనా దిగజారిస్తుంది._*
*_నాకు తెలిసి నటించడం తెలిస్తే బిందాస్ గా బతికేయొచ్చు ఈ లోకంలో కానీ, వేస్తున్న వేషాల యొక్క రంగు బయట పడ్డాక నీ మొహం_* *_చూడడానికి కూడా ఇష్టపడరు గుర్తుపెట్టుకో..._*
*_ఈ లోకమంతా ఇడియట్ లతో, అవకాశవాదులతో నిండి ఉంది. కృతజ్ఞత, ఆత్మీయత, అనురాగాలు, ప్రేమలు కేవలం నీటి మీద మూటలే. నూటికి ఒక్కరూ కొందరు మాత్రమే సహాయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతా భావంతో ఉంటారు.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌻🌈🌻 😍🙇♂️😍 🌻🌈🌻
No comments:
Post a Comment