Wednesday, June 11, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
             *అదృష్టవంతుడివి*

*ఈ లోకంలో పక్కవారితో పోల్చుకొని మనమెంతో దురదృష్టవంతులం అనుకుంటూ విచారిస్తూ ఉంటారు. మనకున్నది గమనించరు. అసలు మనం ఎంత అదృష్టవంతులమో మనకు తెలుసా.?? నిజానికి మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే సగం మానసిక, శారీరక రోగాలు పోతాయి.*

*రాత్రి గాఢనిద్ర పోయి ఈ రోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే, దేశంలో నిన్న రాత్రి లోపు అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు ఎంతో అదృష్టవంతుడివన్నమాట.*

*నువ్వింత వరకు  కరువులో శరనార్ద శిబిరాన్ని కాని చూడలేదంటే, ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే అదృష్టవంతుడివన్నమాట.*

*ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, వంటి నిండా బట్టలు వేసుకొని, కంటినిండా నిద్ర పోగలిగితే, ప్రపంచములోని 75 శాతం ప్రజల కన్నా ధనవంతుడివి అన్నమాట.*

*నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, bank account లో balance ఉంటే, world లోని 8 శాతం ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*

*నీ పిల్లల ద్వారా ఆప్యాయత, అనురాగం మరియు ఆనందం పంచుకుంటూ జీవితం గడుపుతూ ఉన్నట్లైతే ప్రపంచపు 5 శాతం పిల్లలు పడే మానసిక, శారీరక బాధ వారి తల్లి తండ్రి విడి పోవడం వల్ల కలిగే దాంట్లో నువ్వు ఒకడివి కాదు అన్నమాట.*

*నువ్వు హాయిగా తలెత్తి, ఆహ్లదంగా నవ్వగలిగితే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట.*

*నీవు నేను చెబుతున్నది వింటున్నావు అంటే  ప్రపంచంలో 50 కోట్ల వినపడని వారికంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*

 *నీవు ఈ భువిలోని అంద చందాలను చూసి ఆనందిస్తున్నావు అంటే కంటిచూపు పోయి అంధకారంలో ఉన్న కోట్ల మంది కన్న నీవు ఎంతో అద్రుష్ట వంతుడివి.*                            

*నీవు ఏది తిన్నా అరిగించుకొని హాయిగా నిద్ర పోతే కోట్ల మంది గుప్పెడు గోలీలు మింగిన అరగక నిద్ర రాక ఆయాసపడుతున్నవారి కంటే నీవెంతో అద్రుష్టం ఉన్నవాడివి.*

*నీవు చూడగలుగు తున్నావు, విన గలుగు తున్నావు, నడువ గలుగు తున్నావు, నీ చేతులతో నీ పనులన్నీ చేస్తుంటే ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది అంగవైకల్యం ఉన్న వారి కంటే నీవు ఎంతో అద్రుష్ట వంతుడివి.* 

*నువ్వింకా అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న స్థిర చర ఆస్తుల విలువలని, నీలోని శక్తులని, నీకున్న అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*

*ఇప్పటికైనా నీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని సన్నిహితులతో పంచుకుంటూ తగ్గించుకుంటూ, ఉన్నంతలో నీవు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴

No comments:

Post a Comment