ఎందరిలో ఉన్నా ఒంటరివే
నీ సంతోషాలు నీవే
నీ కలతలు నీవే...
నీ ఆలోచనలే నీకు తోడు...
బ్రతుకు పూల బాట కాదెపుడూ
ముళ్లు రాళ్లు ఎత్తు పల్లాలు
దాటుకుంటూ దారి చేసుకుని
మరీ సాగిపోవాల్సిన అవసరం.
గమనం లో గాయాలు
పయనంలో పరిచయాలు
సమయానికి సహకారాలు
జీవనానికి ఆధారాలు..
స్నేహలు బంధాలు
కొంతవరకే ఆసరా....
నీ బరువును మోసే
రెక్కలు అచ్చంగా నీవే!
ప్రశాంతతను కోల్పోక
ప్రధానతలు తప్పింపక
ప్రలోభాలకు లొంగక చేసే
ప్రయాణమే జీవితం..
నీ దేహం నీకు సైన్యం
నీ ధైర్యం నీకు రక్ష
నీ ఆలోచన ఆయుధం
నీ కలలే నీ గమ్యం గా...
నిన్ను ముందుకు నడిపే
సరికొత్త అవకాశంగా
నిను వరించిన మరో రోజును
ప్రేమిస్తూ గడపమని వస్తున్న
వెలుగు పూలు విరిసే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
బృంద 🙏
No comments:
Post a Comment