**యుక్తి ~ శక్తి**
*లెక్కకట్టకు...*
పరుల బలము తక్కువగా
పొగరు తగదు
*నేనే గొప్పని అందరిలో*
*చిన్నచూపు వద్దు..*
ఒరుల సామర్ధ్యముపై
ఊహించుకోకు అతిగా
*నిన్నునీవు శ్రేష్టగా...*
కండపుష్టి కన్న
బుద్ధివృద్ధి జయాలనిచ్చు
సింగపు కుందేటి కథ
నీతి ఇదియే గదా!
సత్తువుందని *విర్రవీగిన*
కూలుట తప్పదు
హోరుగాలిలో *చెట్టుకన్న*
గడ్డిపోచే నిల్చులే...
లౌఖ్యమున్న బతకవచ్చు
*నుర్విన ఎందైన...*
ఉపాయం లేక గెల్వలేము
*సొంత ఊరైనా...*
తెలివితో సాధించవచ్చు
*త్రిభువనాలనైనా...*
వివేకం లేశమైన *ఎగతాళే* సొంత *వారి* తోనే....!!
No comments:
Post a Comment