Wednesday, June 18, 2025

 *శ్రీరమణీయం*

🕉🌞🌎🌙🌟🚩

_*"నేనెవరు ? అనేది సమాధానం లేని ప్రశ్నలా ఉందే !?"*

*'నేనెవరు' అన్నది ప్రశ్న కాదు. మరణానుభూతిని పొందిన శ్రీరమణమహర్షి 14 సంవత్సరాల కఠోర మౌనం నుండి వెలువడిన దివ్యసందేశం నేనెవరు?*🙏

*ఆధ్యాత్మిక సాధనలోని అనేక కఠినమైన చిక్కు ప్రశ్నలను పటాపంచలు చేసే సమాధానం 'నేనెవరు' ? అన్న నాలుగు అక్షరాల ప్రశ్న నాలుగు వేదాల సారమైన పరబ్రహ్మతత్వాన్ని దర్శింపచేసే ఒక మహామంత్రం.*🙏🙏🙏

*మాయతో నిండిన మనసును ఖాళీ చేసేందుకు శ్రీరమణమహర్షి ప్రసాదించిన గొప్ప సూత్రం.. నేనెవరు ?*🙏

 *సమాధానం లేని ప్రశ్న మనోవ్యాపారాన్ని వదిలించే గొప్ప ధ్యాన ప్రక్రియే ఈ నేనెవరు ?*

 *పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అన్న బేధం లేకుండా ఎవరినైనా అంతర్ముఖులను చేయగలిగిన గొప్ప మంత్రమే 'నేనెవరు' ?*

 *సాధన, స్థాయి, సామర్థ్యాలతో పని లేకుండా, మనసుకు ముక్తిస్థితిని కలిగించే మహావాక్యమిది. కనుకనే భగవాన్ శ్రీరమణమహర్షి జాతి, మత, వయో, లింగభేదాలు లేకుండా, ప్రతి ఒక్కరికి దీన్నే ఉపదేశించారు.*

 *పూజాది క్రతువుల్లో, మంత్రానుష్టానంలో, యోగసాధనలో మనసు నిలిచినప్పుడు పొందే పరమశాంతిని ఒక్క క్షణంలో మనకందించ గలిగిన ఈ మార్గానికి "విచారణ మార్గం" అని పేరు. నిజానికిది ఒక ప్రత్యేకమార్గమే కాదు. ప్రతి సాధనా మార్గంలోనూ ఉండే అంతర్గత సూత్రం.*

 *'నేనెవరు' అన్నది ప్రశ్న కాదు. మరణానుభూతిని పొందిన శ్రీరమణమహర్షి 14 సంవత్సరాల కఠోర మౌనం నుండి వెలువడిన దివ్యసందేశం నేనెవరు?*🙏

_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"*_

_*"మనసును ఖాళీచేసే మహామంత్రం -"నేనెవరు" !''*-

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment