🔔 *జై శ్రీరాం* 🔔
*పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది*
*శ్రీ రాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి “ఇవి మీ వొదిన కేయూరాలేగదా! ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు” అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా ....*
*"నాహం జానామి కేయురే*
*నాహం జానామి కుండలే*
*నూపురే త్వభి జానామి*
*నిత్యం పాదాభివందనాత్"*
.
*దీనర్ధం ఏమిటంటే.. “ఓ అన్నా!వదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలుగానీ గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి!”*
*పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం*
*అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?*
*ఈవిధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడనుండి వచ్చింది ?*
*తల్లి సుమిత్రాదేవి పెంపకం!!*
*రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా !*
*"రామం దశరధం విధ్ధి,*
*మాం విధ్ధి జనకాత్మజాం,*
*అయొధ్యాం అటవీం విధ్ధి*
*గచ్చ తాత యధాసుఖం"*
*రాముణ్ణి దశరధుడనుకో,*
*సీతను నన్ననుకో!*
*అడవిని అయొధ్య అనుకో
*హాయిగా వెళ్ళిరా నాన్నా!*
*ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు.*
*చీరతొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసివచ్చినప్పుడు... తలవంచుకుని మాట్లాడిన అద్భుత శీలసౌందర్యం లక్ష్మణస్వామిది!*
*నేడు ప్రతి తల్లి తెలుసుకోవలసిన సత్యం ఇది కాదా ! *
*పిల్లలను ఈవిధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది?*
*నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి? బంగారుతల్లుల జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?*
*రామాయణం, రామకధలు విరివిగా ప్రచారం చేయండి !*
పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో ! స్త్రీలతో ఎలామెలగాలో అన్నీ తెలుస్తాయి !
No comments:
Post a Comment