*ఏయే సత్కర్మలు, దుష్కర్మలు వరుసగా సుఖదుఃఖాలనే ఏయే ఫలితాలనిచ్చినా సరే, నీవు నీ స్వరూపాత్మలో లీనమైన మనస్సుతో ఆ రెండు కర్మలను జయించగలవు.*
వివరణ: *ఆత్మలో సంస్థితమై యుండటం చేత కర్తృత్వభోక్తృత్వాలు నశించి, ప్రారబ్ధాన్ని అనుభవించే భోక్త లేకుండా పోవటమే విధిని జయించుట అంటారు.*
కలలోనుండి మేల్కోవడం కాదు,
కలే మేల్కొంటుంది.
కనిపించేది, వినిపించేది అబద్ధం.
కనేవాడు, వినేవాడు నిజం.
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.693)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌷🙏🌷

No comments:
Post a Comment