*అహం చైతన్యమేవ హి*_ 💐
💐 _*నేను కేవలం చైతన్యాన్ని*_
-- యజుర్వేదం
🪷 ఇది కృష్ణ యజుర్వేదాంతర్గతంగా చెప్పబడుతున్న 'తేజబిందూపనిషత్తు' లోని వాక్యం. ఉపనిషత్తులన్నీ తేల్చిచెప్పిన పరమసత్యం♪.
విచారణతో దీనిని పరిశీలిస్తే 'నేను' ఏమిటో తేలుతుంది.
🪷 ఈ తత్త్వజ్ఞానాన్ని కలిగించడానికి ఉపనిషద్విజ్ఞానం పలుబోధనలను, సాధనలను ఆవిష్కరించింది♪. కొంచెం ఏకాగ్రంగా ఆలోచిస్తే తేలికగా అవగతమయ్యే విషయమిది♪.
🪷 'నేను' అనుకోగానే మనకి స్ఫురించేది మన దేహం, నామం, వీటితో ముడివడి ఉన్న బంధాలు♪. 'నేను ఫలానా రంగువాడిని - ఫలానా పేరున్నవాడిని. నేను పేదను. నేను రాజును. నేను ఫలానా పదవి గలవాడిని' ఇలా 'నేను' అనే మాటని అనేక విశేషణాలతో కలిపి వ్యవహరిస్తుంటాం♪.
✳️ _*[దేహం ద్వారా వ్యక్తమయ్యే 'నేను' అనే భావాన్ని క్రమంగా మూలమైన చైతన్యంగా గుర్తించగలిగితే అంతటా ఉన్న ఏక చైతన్యంలోనే లీనమవుతాం♪. చక్కని ధ్యానంతో, విచారణతో దీనిని సాధించగలుగుతాం. ‘అందరిలో నన్ను, నాలో అందరినీ చూడాలి'- అదే యోగదృష్టి♪.]*_
✳️👉 _*'[సర్వభూతస్థ మాత్మానం*_
_*సర్వభూతానిచాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మా...']*_
అని గీతలో
చెప్పిన మాట ఇదే.
🪷 కాస్త వివేచన చేస్తే ఈ విశేషణాలలో వేటికీ కూడా శాశ్వతత్వం లేదు♪. ఒక్క 'నేను'కి తప్ప. 'నేను' అనే స్ఫురణ చేతనే ఈ 'ఫలానావి' అన్నీ ఉన్నాయి కానీ, వాటిపై 'నేను' అనే స్ఫురణ లేదు. 'నేను బాలుడ్ని' అనుకున్నవాడు కొంతకాలానికి 'నేను' వృద్ధుడ్ని అంటాడు. బాలునిలా ఉన్నప్పటి ప్రవర్తనకీ, వృద్ధుడైనప్పటి ప్రవర్తనకి తేడా ఉంటుంది. కానీ రెండు దశలలోని 'నేను' కి మార్పు లేదు♪.
🪷 ఇంద్రియాలలో ప్రసరించే చైతన్యం మెలకువలోనే తెలుస్తోంది. కలలో ఇంద్రియచైతన్యం నిద్రాణమై మనోరూపంగా స్ఫురిస్తుంది. గాఢనిద్రలో ఈ రెండే నిద్రాణమై అణిగి ఉంటాయి. కానీ తిరిగి మేల్కొన్నాక 'నేను గాఢనిద్రపోయాను' అనగలుగుతున్నాం♪. అంటే మెలకువకీ, కలకీ, గాఢనిద్రకీ అతీతంగా 'నేను' అనే చైతన్యం ఉన్నది. అది అన్ని అవస్థలకీ, బంధాలకీ అతీతం♪.
🪷 'నేను' అనే స్ఫురణ ఏ చైతన్యం వల్ల కలుగుతున్నదో గమనించాలి♪. ఆ గమనింపే ధ్యానం, అంతర్ముఖ ప్రయాణం♪. అది సాగితే విద్యుత్పరికరాల్లో విద్యుత్తులా - దేహ,మనః ప్రాణాలలో ప్రసరించే చైతన్యం వీటిలో ఉంటూనే వీటికి అతీతంగా ఉందని తెలుస్తుంది. పరికరాలను పనిచేయించే విద్యుత్తు... పరికరాల కన్నా అతీతంగా ఉంది కదా!
🪷 “వివిధ రంధ్రాలున్న కుండని ఒక దీపంపై బోర్లించితే అన్ని రంధ్రాల నుండి దీపకాంతి కనిపిస్తుంది♪. కానీ, ఎన్ని రంధ్రాలున్నాయో అన్ని వెలుగులు లేవు♪. అయితే కుండలోని బహుత్వం వల్ల కాంతి బహురూపాలుగా గోచరిస్తుంది♪. అలాగే మనలోనున్న 'చిచ్ఛక్తి' అన్ని ఇంద్రియాల ద్వారా వివిధ విధాలుగా వ్యక్తమవుతున్నా, అది ఒక్కటే” అని శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో వచించారు♪.
🪷 ఈ చైతన్యం 'నేను'గా స్ఫురించి, ఆ 'నేను' దేనితో సంబంధం కలిగితే ‘దాని’గా తోచబడుతుంది - స్ఫటికాన్ని ఏ రంగు వస్తువు దగ్గర పెడితే ఆ రంగుగా తోచినట్లు.కానీ స్ఫటికానికి ఏ రంగూ లేదు♪.
🪷 అలాగే మనలోని చైతన్యం శుద్ధం, నిర్మలం, ఇంద్రియాతీతం♪. 'అహం' స్ఫురణకి ఆధారమైన చైతన్యంలో ఈ 'అహం'(నేను) అనే భావం లీనమైతే 'శివోహం', 'అహం బ్రహ్మాస్మి'♪.
🪷 ఈ చైతన్యం దోమను మొదలుకొని ఏనుగు వరకు, గడ్డిపరకను మొదలుకొని బ్రహ్మదేవుని వరకు ఒక్కటే. ఉపాధి భేదాల బట్టి రకరకాలుగా వ్యక్తమవుతున్నా చైతన్యం ఏకమే. దీనిని గ్రహించినప్పుడు, దీనితో తాదాత్మ్యం చెందినప్పుడు లోకవ్యవహారాలు నిర్వహిస్తున్నా, దేనికీ అంటుకోని లక్షణం ఏర్పడుతుంది♪.
🪷 దేహం ద్వారా వ్యక్తమయ్యే 'నేను' అనే భావాన్ని క్రమంగా మూలమైన చైతన్యంగా గుర్తించగలిగితే అంతటా ఉన్న ఏక చైతన్యంలోనే లీనమవుతాం♪. చక్కని ధ్యానంతో, విచారణతో దీనిని సాధించగలుగుతాం♪.
🪷 'అందరిలో నన్ను, నాలో అందరినీ చూడాలి' - అదే యోగదృష్టి♪.
_*'సర్వభూతస్థ మాత్మానం*_
_*సర్వభూతానిచాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా...'*_ అని గీతలో చెప్పిన మాట ఇదే.
🪷 'నేను' అనే భావాన్ని విడిగా చూసేవాడు జీవుడు, అంతటా ఉన్న 'నేను'తో తన్మయం చెందించేవాడు యోగి. ఎన్ని అలలున్నా, అన్నిటిలోనూ సముద్రచైతన్యం ఒకటే. అదే విధంగా విశ్వంలోని భిన్నభిన్నంగా గోచరించే వాటి యందంతటా ఉన్నది ఏకచేతన్యమే♪. దానిని తెలుసుకుంటే ఆ విశ్వాత్మతో మనం అవిభాజ్యులమవుతాం♪.
👉 ఈ విచారణయే మన వేదాంత సిద్ధాంతాలన్నిటికీ పరమగమ్యం.
🙏 _*శుభం భూయాత్*_ 💐
🌹🙏🌴🪔🪔🌴🙏🌹
No comments:
Post a Comment