*త్రిగుణాలు.. వాటి స్వభావాలు.*
1. సత్త్వగుణం : అహింస, పరుల ద్రవ్యములందు, పరస్త్రీల యందు అభిలాష లేకుండుట, కోపము లేకుండుట, గురుశుశ్రూష చేయుట, శౌచము అనగా దేహశుద్ధి, మనోశుద్ది కలిగి యుండుట, సంతోషము, సత్యమార్గము, దంభము లేకుండుట, దైవందు, వేదముల యందు నమ్మకము కలిగియుండుట, ఇతరులకు అపకారం చేయకుండుట, ఇవన్నీ సత్త్వగుణం యొక్క లక్షణాలు.ఆదిత్యయోగీ..
2. రజోగుణం: నేనే కర్తను, నేనే భోక్తను, నేనే వాచాలకుడను, నేను అభిమానం గలవాడను, నాకే అన్నీ తెలుసు, అనేవి రాజస ప్రవృత్తి గలవారి లక్షణాలు.
3. తమోగుణము: నిద్ర, సోమరితనం, మోహము, ఆశ, మిథునం, దొంగతనం, తామస ప్రవృత్తి గలవారి లక్షణాలు. దీని శక్తిని ఆవరణ శక్తి అంటారు.
దీనివల్ల ఓకేవిధంగా ఉండే వస్తువు గాని మనిషిగాని ఇంకో విధంగా కనిపిస్తారు. ఇదే సంసారానికి మూలకారణం. తమోగుణము చేత కప్పబడినవారు ఎంతటి బుద్దిమంతుడైనా, విద్వాంసుడైనా, నేర్పరియైనా విషయాన్ని సరిగ్గా గ్రహించలేడు. తమోగుణము ఒకరకమైన భ్రమను కల్పిస్తుంది. దానివల్ల తనకు కనిపించినదే, తెలిసిందే నిజం అనుకుంటాడు. దీనికి నలుగురకాల శక్తులున్నాయి.
1. అభావన ,: నమ్మకం లేకపోవడం,
2. విపరీతభావన : నేను ఈ శరీరాన్ని అనుకోవడం,
3. పని జరుగుతుందా లేదా అనే అనుమానం,
4. విప్రపత్తి : ఉన్నదా! లేదా! అవునా! కాదా! అని సందేహం తమోగుణ ప్రభావితుడైనవాణ్ణి ఈ శక్తులు వదలవు. ఏదీ తెలుసుకోలేక ఒక స్థంభంలా కదలిక లేకుండా ఉండిపోయాడు.
సత్త్వగుణం ఉన్నవాడు ఊర్ధ్వలోకాలలోనూ, రజోగుణం ఉన్నవారు భూలోకంలోనూ, తమోగుణము ఉన్నవారు అథోలోకాలలోనూ జన్మిస్తారు.
సత్త్వగుణం ఉన్నవారికి బ్రహ్మజ్ఞానం, రజోగుణం ఉన్నవారికి ధర్మజ్ఞానము, తమోగుణము ఉన్నవారికి అజ్ఞానము ఏర్పడతాయి...
No comments:
Post a Comment