*ప్రేమ స్వరూపులైన విద్యార్ధులారా, విద్యార్ధినీయులారా.!*
*దృశ్వగోచరమైనటువంటి ఈ ప్రకృతి యందు, అనేక విధములుగా మానవుడు శోధించాలని, సాధించాలని, రూపించాలని ఎన్నియో భావములు పొందుతున్నాడు. కేవలము మానవుడు భుజ బలమును, బుధ్ధి బలమును, అధికార బలమును, ధన బలమును, జన బలమును ఆశ్రయించి ఈ విధంగా తాను శోధించటకు, బోధించుటకు అన్ని విధముల ప్రయత్నము చేస్తున్నాడు. కానీ, సాధించినదేమిటి?*
*దైవానుగ్రహమే లేక, దైవ సహాయమే లేక, మానవుడు ఏ మాత్రము కూడను ఎట్టి కార్యము యందు కూడను అల్ప మాత్రము కూడను విజయాన్ని సాధించలేడు. బలవంతుడు సానుభూతుడైనప్పుడే ఎట్టి మానవుడైనా ఎట్టి కార్యమునైనను కూడను సాధించడానికి ప్రయత్నిస్తాడు.*
*"నీరు ఎంతటి మలినాన్నైనా శుభ్రం చేస్తుంది. ఎలాంటి వాసన అయినా నీటితో పోతుంది. అలానే శాస్త్రాలు, పురాణములు, కావ్యాలు మున్నగు వాటి అధ్యాయనం ఎంతటి నాస్తికతత్వాన్ని అయినా* *పోగొట్టి భగవంతుని యందు చెదరని బెదరని విశ్వాసాన్ని ప్రేరేపిస్తాయి. అజ్ఞానమను చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాయి.*
*దుర్గుణములతో నిండిన మనో బుద్ధులను సుగుణములతో నింపి, భగవంతుని చెంతకు చేరుకొనుటకు మార్గాన్ని సుగమం చేస్తాయి. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యాయనం చేయాలి. వాటి యందలి సారాన్ని గ్రహించి, ఆచరించాలి. తాము ఆచరిస్తూ మరింత మంది ఆచరించేలా ప్రోత్సహించాలి. తద్వారా అందరూ తరించాలి. మోక్షమును వరించాలి."*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
📿🦚📿 🙏🕉️🙏 📿🦚📿
No comments:
Post a Comment