*_మురికిగా ఉన్న నీరు త్రాగడానికి పనికి రాక పోవచ్చు, కానీ మంటలను ఆర్పడానికి పనికి వస్తుంది కదా._*
*_అలాగే పనికిరాని బంధమని చులకనగా చూసి త్రుంచి పారెయ్యకూడదు. బంధ మెప్పూడూ బంధనమవ్వదు._*
*_ఒక మనిషి తనకు తాను గొప్పవాడని అనుకోవటం ఎంత తప్పో, తాను తక్కువ వాడినని అనుకోవడం కూడా అంతే తప్పు మొదటిది గర్వానికి, రెండోది పిరికితనానికి దారి తీస్తాయి._*
*_ప్రతీ ఒక్కరితోనూ మంచిగా ఉండాలి. ఇది సమాజంలో మంచి గౌరవాన్ని, పేరు ప్రఖ్యాదులను తెచ్చి పెడుతుంది. అందరికీ మంచినే చేయాలి._*
*_ఇది మనం అవసరంలో ఉన్నపుడు మనం ఊహించని విధముగా తిరిగి మనలను ఆదుకుంటుంది. అందరిలోనూ మంచినే చూడాలి._*
*_ఇది మన హృదయ భూమిని దున్నివేసి అహంకార మమకారాది వికారాలను ఏరి పారేసి క్షమ, దయాది సద్గుణాలను మెులకెత్తేలా చేస్తుంది._*
*_దేవుని సంతృప్తి పరచుటకు, ఆయన చెంతకు చేరుకొనుటకు ఇవే ఏకైక మార్గాలు.☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🌷🪷 🦚🙇♂️🦚 🪷🌷🪷
No comments:
Post a Comment