Sunday, June 15, 2025

*🔔నమోః వెంకటేశాయః🔔* 
 🕉️🌍🌞🌙⭐🌈

*🍁బ్రతుకు నేర్పిన బడిలో... మనం నేర్చుకోవాల్సింది ఒకటే... కొన్నిసార్లు, కారు చీకట్లు కమ్ముకున్నా, అవి మనల్ని అత్యున్నత స్థానాలకు చేర్చగలవు. విషపూరిత బంధాలే, గొప్ప పాఠాలు నేర్పగలవు. మన తీరని వేదనలే, ఎదుగుదలకు బాటలు వేస్తాయి... ప్రేమ, స్నేహాలలో గుండెకోతలే, కొత్త బంధాలకు దారి తీస్తాయి. క్షణకాలం శాపమని భ్రమపడేది, నిజానికి అదొక వరమని గ్రహించాలి. ఎక్కడైతే దారి అంతమవుతుందో... అక్కడే మరో కొత్త పయనం మొదలవుతుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఆశ ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుంది. మనం ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా... మనం ఆశను వదులుకో కూడదు. గుండెల్లో భయం ఉన్నా, మనం ముందుకు సాగాలి... శక్తి అంతా సన్నగిల్లినా, మనం మళ్ళీ లేచి నిలబడాలి, ముందుకు అడుగు వేయాలి... ఇంత దూరం వచ్చాం. ముందుకు వచ్చేది ఏదైనాసరే, మనం దాన్ని కూడా దాటుకుపోతాం.* *ఎందుకంటే నేడు మన పోరాటమే, రేపు గతంగా మారుతుంది. అదే మన విజయానికి సాక్ష్యమవుతుంది...* 

 *🌄 శుభసాయంత్రం💥* 

🕉️🌍🌞🌙⭐🌈

No comments:

Post a Comment