Friday, April 24, 2026

 🕉️ *జై శ్రీమన్నారాయణ* 

*_🌴భక్తులు సాధన చేసినపుడు లక్ష్యమును దృష్టిలో పెట్టుకొని సాధన చేస్తుండాలి. లక్ష్యమంటే కోరికలు తీర్చుకోవడం కాదు! తన ఆత్మ పరమాత్మలో లీనం కావాలి అనేదే అసలైన లక్ష్యముగా కలిగిఉండాలి. దాని కోసం నిరంతరం సాధన చేస్తుండాలి. చదువుతున్న ఒక విద్యార్థి  భవిష్యత్తులో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదివితే ఒకటి రెండుసార్లు తప్పినా తదుపరి ప్రయత్నంలో అయినా తప్పక సాధిస్తాడు. కానీ లక్ష్యమే లేని విద్యార్థి ఎన్ని చదువులు చదివినా ఏమీ నేర్వలేడు, దేనినీ సాధించలేడు! గుంట నక్కను గురిచూసి కొట్టేకన్నా గురితప్పైనా గాండ్రించే పులిని కొట్టడం ఉత్తమం. కనుక చిన్న కోరికలు కోసం కాకుండా భగవంతుడే కావాలని సాధన చేయాలి. ఆ పరమాత్మ కొరకు సాధన చేసినపుడు ఈ దేహమును కాపాడుకొనుటకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఆయనే చూసుకుంటాడు. 🌴_*

No comments:

Post a Comment