Friday, June 5, 2026

 [6/3, 23:54] +91 94918 93164: *యోగి వేమన -3*
రచన : మాలయశ్రీ 


దేవదాసి తల్లికి మాత్రం బెంగపట్టుకుంది, ఆమెకు డబ్బు పిచ్చి జాస్తి, ఏ ఒక్కరిపైనా వెలయాలి ప్రేమ నికరంగా ఉండకూడదని ఆమె తలంపు, అసలు తమవంటి స్త్రీలకు మగవారిపై ప్రేమే ఉండకూడదు. కాని, ఉన్నట్లుగా నటిస్తూ వారి నుండి కుప్పలు కుప్పలుగా ధనందోచి ఆ తర్వాత ఒకరివెనుక ఒకరిని వీధుల్లోకి నెట్టివేయాలనే సిద్ధాంతం ఆమెది.

తల్లి, దేవదాసికి నచ్చచెప్పింది, వేమారెడ్డి బుద్ధిమంతుడే కాని వదిన చాటు పిల్లడు. డబ్బు దస్కం ఇవ్వలేడని, కూతురుకు కోపం వచ్చింది.

“డబ్బు తప్ప మరో ధ్యాసలేదా అమ్మా నీకు? ప్రేమించే పురుషుడు లభించడం స్త్రీకి వరం: అటువంటి సజ్జనుని నీడలో జీవించడం భాగ్యం, మరణించినా జన్మధన్యం।" అంది, ముక్కుపై వేలేసుకుంది జనని.

“ఈ ప్రేమలు అన్నంపెట్టవే వెర్రితల్లీ" మాత హితోపదేశం.
“నీ వంకర నడకలు నాకు చెప్పకు." కసురుకుంది కూతురు.

"ఆ నడకలతోనేనే నేను నీకీ హంస నడకలు నేర్పింది. అవి చూసే ఆ రెడ్డబ్బాయి మోజుపడి నీ కాళ్ళకడ పడి వుంది."
“ఆయన కాదే నేనే ఆయన కాళ్ళకడ పడి ఉన్న."
“ఏమిటేమిటీ?"
"సమాజంలో మనకెంత గౌరవముందో తెల్సా తల్లీ నీకు?"
“మనకేమయిందని-దేవదాసీలం!"
"దాసీలం.”

ఇంతలో వేమారెడ్డి అక్కడికి వచ్చి "నీ కూతురు నాకు సొంతం. ఎంత ధనమైనా ఈమె కోసం ఇస్తాను" అన్నాడు.

“ఇస్తావు నాయనా! ఎందుకివ్వవ్? నేను ఇన్నాళ్ళు దాన్ని పెంచింది ఇందుకోసమేనాయె" అని ప్లేటు ఫిరాయించింది; ముక్కు చీత్తూ ఏడ్పు మొదలుపెట్టింది ముసలమ్మ.

“ఏడవకమ్మా-నీకిప్పుడేం ప్రమాదం వచ్చిందని" వేమన అన్నాడు.

"ఇంకేం కావాలి నాయనా: ఎదిగిన కూతురు ఆటపాటలు నేర్చింది, దినం బంగారు గుడ్లు పెట్టే బాతు అవుతుందనుకుంటే"
”ఛీ! నోర్ముయ్" దేవదాసి తల్లిని కసిరింది.

"నువ్వూర్కొ దేవీ!" వేమన వారించాడు.

"చూశారా అయ్యా-అదీ దాని వాలకం. తల్లినని ఇంగిత జ్ఞానమయినా లేదు"
"తల్లి! ఇలాంటి తల్లి పగవారికయినా వద్దు దేవుడోయ్”
“చూశావా అయ్యా”
“ఏం కావాలమ్మా నీకు?" వేమన అడిగాడు.
"ఇంకేం కావాలి? మా అమ్మకు డబ్బు పిచ్చి 
జాస్తి" చిన్న కూతురంది.
"ఓస్! అంతేకదా ఎంత కావాలి?"
"మీరూరుకోండి. దానివన్నీ దొంగ యేడుపులు" దేవదాసి అంది. అటు వారించి ఇటు తిరిగి "ఎంతకావాలమ్మా?" అన్నాడు.
"ఎంతిచ్చినా తక్కువే-నా బిడ్డ రతనాల బొమ్మ" నసుగుతూ అంది ముసలమ్మ.

“సరేలే విచారించకు. నువ్వన్నట్లే నిన్ను డబ్బుతో ముంచెత్తుతాను, సరేనా?" వేమన హామీ ఇచ్చాడు.

“మా తండ్రే!" సంబరంతో మెటికలు విరిచింది వేశ్యమాత. అటు తిరిగి కూతురుతో అంది.

"వెళ్ళమ్మా! అబ్బాయి ఎంత సేపని నిల్చుంటారు? ఎండనపడి వచ్చారు. దాహానికి మజ్జిగ ఇవ్వు"
“ఇనుప గజ్జెల తల్లి" వెక్కిరించింది పుత్రిక.
“అనవే అను. బంగారు గజ్జెలేనే నేను నా వయసులో కట్టుకున్నవి" చేతులు తిప్పుతూ అంది.

"ఆ బ్రతుకు బ్రతక్కపోతేనేం?"
“తలరాత” నెత్తిన కొట్టుకుంది ముసల్ది.
“చేతులారా చేసుకుంటూ తలరాతట-వాత"
ఆమె నోటిని మూసి వేమన లోపలికి నడిచాడు.

"మీరు మా అమ్మ మాటలు పట్టించుకోకండి"
“నీకెందుకా సంగతి?"
“నాకు కాకపోతే మరెవ్వరికి?”
“నాకు-”
"మీ సంగతి నాకు పట్టలేదా?”
"ఉంది కాని నాతోనే, డబ్బుతో కాదు"
“డబ్బిస్తే నామీద ఒట్టే"
“ఇవ్వను. మరి కథ రచ్చకెక్కుతుంది. మనం రద్దీ పాలవుతాం. నిన్ను వదలి నేను జీవించలేను"
“ఎటైనా పారిపోదాం"
"మా వదిన నన్ను విడిచి వుండలేదు"
“మీ ఇష్టం" మూతి ముడిచింది.

“అలిగినా అందంగా వుంటావు ప్రియా నువ్వు"
"ఏడిస్తే ఇంకా బాగుంటా"
"ఏదీ ఏడ్వు" నవ్వుతుంది.
“ఏడ్వడమంటే నవ్వడమా?”

"మీరు దగ్గరుండగా ఏడ్వటం నాచేతనవుతుందా?"
"అంత ఆనందంగా వుంటుందా?"
"అవును మరి”
"నాకెలా వుందో చెప్పనా?"
"ఊఁ"
"నీ ఒడిలో ఇలాగే నిశ్చింతగా హాయిగా చావాలని!"
"బాగుంది. మంచిదే కోరిక? మరెప్పుడిలా అమంగళం మాటలు పలక్కండి" ఏడుస్తుంది.

"సరే-ఏడవకు” ఇంకా ఏడ్చింది.
"నేను నిన్ను విడిచి జీవించలేను దేవీ"

"ఇప్పుడా బాధేం వచ్చింది?" కళ్ళు తుడుచుకుంటూ అంది.

“వదిన వస్తుందేమోనని”
"ఎందుకు-"
"జనం కోళ్ళె కూస్తున్నారు.”
“అయితేనేం?"
“మా అన్నగారివరకూ వెళ్ళిందీ విషయం”
“ఏమన్నారు?”
“ఏమంటారు, లోకంలో వున్నమాటే-”
“ఏమిటి?”
“పెళ్ళిచేసుకొమ్మని”
“చేసుకోండి”
“ఎవర్ని -నిన్నా?”
“నన్నా ?”
"నిన్నే అయితే నిరభ్యంతరంగా పెళ్ళాడేవాడిని"
"కులం కాదుకదా-"
"గుణం వుంది చాలు"
“పెద్దలొప్పుకోరుకదా?”
"అదే వచ్చిన చిక్కు"
“మీరేమన్నారు?”
“ఏమనలేదు”
"చేసుకోండి"
“నీకు బాధగా వుండదా?"
“ఉండదు”
“నాకుంటుంది.”
"ఇలాగే నన్ను మీదానిలా వుండనిస్తే చాలు”
“అదెలాగూ తప్పదనుకో"
“మరింకేం?”
“అదే నేననేది. ఇంకా వేరే పెళ్ళేమిటా? అని"
“కులం'గోత్రం-”
“ఉద్ధరించేవాళ్ళు ఉద్ధరించుకోనీ”
“నన్ని లాగయినా వుండనీయరా!"
“ఉండాలనే”
“మీరు పెళ్ళి వద్దంటే మీ పెద్దవాళ్ళు మనమీద ఒత్తిడి తెచ్చి దూరం చేస్తారు"
“అదీ చూస్తాను ఏం చేస్తారో”
“అతిసాహసం”
“అదే పౌరుషమంటే"
"నాకు తెలవదు బాబోయ్!"
“కనకనే స్త్రీ వైనావ్”
“ఈరోజు ఉద్రేకంలో వున్నారు"
“అవును వున్నాను”
“దేనికి ?”
"ఉహు జోలపాడు నిద్రపోతాను”
"నిజమా?”
"పాడు: నిజమో కాదో ఆపై చూడు"
ఆమె నవ్వింది — అతడూ నవ్వాడు.

*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
[6/4, 19:04] +91 94918 93164: *యోగి వేమన -4*
రచన : మాలయశ్రీ 


*వదిన నగలు కాజేశాడు*

నరసమాంబకు మరదిపై ఎనలేని ప్రేమ. కూతురు జ్యోతి కంటే అతడంటే గారాబు. సొంత కొడుకులా చూస్తుంది. ఏదో సమాధానం చెప్పి తప్పుకునేవాడు వేమన. వేళకు భోజనానికి రానప్పుడు, వదిన-ఇదేమిటయ్యా? అని అడిగి నప్పుడు, అడిగి కొన్ని అడగక కొన్ని వదిన నగలన్నీ కాజేశాడు. వాటినన్నింటినీ దేవదాసి తల్లికిచ్చాడు. ఆమె పోరుమానింది కాని అన్నపోరు పెరిగింది.

ఒకనాడు జ్యోతి తన తల్లి నగలు పెట్టుకుంటానని మారాం చేయసాగింది. ఆమె ఎంత వారించినా వినదు. అప్పుడే వచ్చిన రాచవేమన కూతురికి నగలిమ్మన్నాడు. తర్వాత ఇస్తానని మాట దాటవేసింది నరసమాంబ. ఆయన పట్టుపట్టి వెళ్ళి పెట్టె తెరచి చూశాడు. ఏముంది? పెట్టె ఖాళీ
"ఇదా సంగతి? ఒంటిపై నగలు లేకుంటే అదేమిటోలే అనుకున్నాను ఇన్నాళ్ళు." అన్నాడు. ఆమె మారు పలుకలేదు.

“చెప్పవేం ఏమైనవి?"
"పెట్టెలోనే పెట్టాను." ఆమెకు ఏం చెప్పాలో తోచలేదు.
"దొంగలు పడ్డారా?" - మౌనం.
"దయ్యాలు మాయం చేశాయా?" ఆమె బదులు పలకలేదు.
"ఇది మీ ముద్దులమరిది చేసిన ఘనకార్యం కదూ?"
“ఏమోనండీ.”
"ఆవును! నాకు తెల్సు. వాడినేం చేయదల్చుకున్నావో నీ యిష్టం. ఆ నగలు నీవి, ఉంటే వాటిని అలంకరించుకునే దానివి నువ్వు. లేకుంటే బికారిలా ఉండేది నువ్వు. కాని నీ అతి గారాబంతోనే వాడిని పాడుచేస్తున్నావ్. ఎలా దారికి తెస్తావో నీ యిష్టం. వాడిని ఓ యింటి వాడిని చేసే బాధ్యత మాత్రం నీది.”

ఆమె ఏమీ అనలేదు.

*అన్న తో పేచీ*

చిలికి చిలికి ముసురు, గాలివాన అయినట్లు ఆ యింట్లో అలజడి పెద్దదయింది. వదిన మాట మరది వినలేదు, మారలేదు. రాచవేమన్న తమ్ముని గట్టిగా మందలించాడు.

"అయిందేదో అయింది. నీ మూలంగా ఊళ్ళో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. నా మాట విని బుద్ధిగా పెళ్ళిచేసుకో. మామవాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. వయసొచ్చిన కుర్రాడికి సమయానికి పెళ్ళిచేయక ఇలా ఊరి పై వదిలానని నింద నాకు."

“నాకు ఏ పెళ్ళీ వద్దు.”
“ఏం?”
“ఇలాగే ఉంటా-”
"ఎలా ?"
“ఇప్పుడున్నట్లే.”
"బాగుందిరా నీ వరస, ఇత్తడి పుత్తడి కాదు, తొత్తు దొరసాని కాదు. ఆ కులంకానిది నీకు పెళ్ళామవుతుందా?"
“అవుతుంది.”
“అవుతుంది. ఎవరురా నిన్ను సహపంక్తికి రానిచ్చేది?"
“రానివ్వకపోతే చింతలేదు.”

“ఎలా బాబూ అలాగంటే? నీకో బాబు పుడితే వంశం నిలుస్తుంది. అందుకోసమే ఎదురు చూస్తున్నాం నాయనా : నీ మీది ఆశతోనే మీ అన్నగారు నేనెన్ని చెప్పినా వినక మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు." వదిన అంది.

“అయితే ఏం పర్వాలేదు, జ్యోతికి పుట్టిన బాబును పెంచుకోవచ్చు.”
"ఎలాగయ్యా ఇలా అంటే ?"
“అలాగేనే. నీవు పెంచినవాడు, నీవు ఇచ్చిన గారాబం. వేశ్యను పెళ్ళాడుతాడట ఇప్పుడు." భర్త ఆన్నాడు.

"వేశ్యలెవరు ? మనుష్యులు కారా-" వేమన అన్నాడు.
"అంతా మనుషులే ఎందుకు కారు. కానయితే గౌరవం తక్కువ. అంతే." రాచవేమన వివరించాడు.

“ఎందుకు ? దేవతలని పూజలని అంగరంగ వైభోగాలని దేవదాసీలను తయారు చేసింది మీరు. మళ్ళీ వాళ్ళను చిన్నచూపు చూసేదీ మీరే.”

"నాకు అంత పెద్ద ఆలోచనలు రావు పెద్దల మార్గంలోనే నడుస్తున్నాం."
“మంచినైతే పెద్దలనుంచి స్వీకరించాలి. చెడు ఏదైనా పెద్దల దారిలో వుంటే వదలిపెట్టాలి."
“వచ్చేశాడు సంఘ సంస్కర్త‐"
“ఎవరి కర్మలకు వారే కర్తలు-"
"లోకం నన్ను నిందిస్తున్నది కదా-"
"భారం నాపై త్రోసెయ్యండి-"

“వద్దు నాయనా ఆ మాట, మా మనసులు కష్టపెట్టకు.” వదిన బాధతో అంది.

"నా మనసు వినదమ్మా"
“వినాలి నాయనా."
"ఎందుకే ఇంకా-కొలుపు పెట్టి చెప్పగా తలుపు పెట్టి అడిగినట్లు. వినడట. వినక వెళ్ళి ఏ గంగలో కలుస్తాడో కలవనీ." కోపంతో అన్నాడు అన్న.

"అన్నగారి ఆశీర్వాదాన్ని శిరసావహిస్తాను.”
“నా ముందు నిలవకింక."
"అలాగే" అని వేమన వెళ్ళిపోయాడు.

"ఆగవయ్యా.” అని వదిన పిలిచినా ఆగలేదు.
“ఎందుకండీ ఆయన్నలా వెళ్ళమన్నారు?" భర్తనడిగింది.
"ఆనందాన్ని ఆనుభవిద్దామని,"
"అయ్యో దేవుడా!" ఆమె వ్యధ చెందింది.

“ఇక ఆ దేవుడే ఆదుకోవాలి మనల్ని." కన్నీటిని పై పంచెకొంగుతో ఒత్తుకున్నాడు రాచవేమన.

“మీరేడవకండి.” అంటూ తాను కన్నీరు కార్చసాగింది.
“ఏడుపే మిగిలిందింక."
“ఎందుకండీ అంతగా రంది పడతారు. అతనే దారికి వస్తాడు.”
"ఆ ఆశ కలిపించడంలేదు. అడ్డాలనాడే బిడ్డలుకాని గడ్డాలనాడు కాదు. సొంత కొడుకులే వినని పాడు కాలమిది. అందులో తోడబుట్టిన వాడు ఎలా వింటాడు. వానికి పౌరుషం జాస్తి, మొండిఘటం, దారికి వస్తాడనే నమ్మికలేదు."

"అలా దిగులు పడకండి తప్పక బుద్ధి వస్తుంది. మారతాడు. పదండి భోంచేద్దురు."
"ఇంటికి వచ్చినవాడ్ని తిననీయకుండా పంపించాను.”
“ఎక్కడో తింటాడు, ఉపవాసముండడు-మీరు లేవండి.”
“నాకు ఆకలిగాలేదు.”
"సరే” 

ఆమె వంటింటిలో పాత్రలు సర్దడానికి వెళ్ళింది.

*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment