Friday, June 5, 2026

 ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు 💐 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏విశ్వ గురువులు శ్రీ కృష్ణ పరమాత్ములవారు , జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు, పూజ్య గురువులు గురు దత్తాత్రేయ స్వామి వారు, పూజ్య గురువులు గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని  కోరుకుంటూ.. అందరు బాగుండాలి.. 

*ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు💐🌹🥭🍫🍇*
 

           అందమైన *రేపు* వస్తుందనేది  ఎంత *వాస్తవమో* . ఈ సమయం *పోతే తిరిగి* రాదు అనేది కూడా *అంతే నిజం* . కాబట్టి ఈ సమయంలో మంచి పనులు చేద్దాం 🙏



        ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టుకతో *పూలవనం* కాదు అందరివీ *పడిలేచే* బతుకులే, మన ఒక్కరికే కాదు అసలు *భూమిపైన* సమస్యలు లేని *మనిషే లేడు,* అందుకే *రేపటి* రోజు *సంతోషం* వస్తుందనే *ఆశతో* నవ్వుతూ *జీవిద్దాం* .

           ఏ *స్నేహం* చివరిదాకా *పయనం* సాగిస్తుందో లేదో *కానీ* ప్రతిరోజు *పలకరింపు* ఆ స్నేహానికి *ప్రాణం పోస్తూ* ఉంటుంది,, ఎదుటివారు మనకు *ఏమి చేసారూ, ఏమిచ్చారు* అనే దాన్ని బట్టి కాదు.. మనం *ఎదుటివారికి ఏమిచ్చాం, ఏమి చేసాం* అనే దాన్ని బట్టి *మన విలువ* మారుతుంది *పెరుగుతుంది* !

      ఎదుటి వాళ్ళు మనకు *నచ్చిన పనులు* చేస్తే వారు *మంచోళ్ళు*, అదే మనకు *నచ్చని పనులు* చేస్తూ వాళ్ళకి నచ్చినట్లు ఉంటే *చెడ్డోళ్ళు*,మన ఇష్టాయిష్టాలే ఎదుటివారి *వ్యక్తిత్వం* ఇదే నేటి *మనిషి తత్వం* .

            ఒకరిని *అపార్థం* చేసుకోడానికి కొన్ని *సెకండ్ల సమయం* చాలు,*కానీ* అర్థం చేసుకోడానికి *రోజులు* పడుతుంది, అందుకే *అపార్థం* చేసుకోవడంలో *ఒక వంతు అర్థం* చేసుకోడానికి కూడా ప్రయత్నించండి *బంధాలు* బలపడతాయి . *కలకాలం* నిలబడతాయి .

*✍️ మీ శ్రేయోభిలాషి 🤝🙏*

No comments:

Post a Comment