Wednesday, June 3, 2026

 *🕉️ఆధునిక మానవునికి ఆధ్యాత్మిక గురువు అవసరమా!?*🙏

*ఓం మాతృదేవోభవ* ముందుగా ఎందరో మహానుభావులు అందరికీ రాఘవ మాస్టారు కేదారి  హృదయపూర్వక వందనాలు 

*🌈మనం ప్రస్తుతము ఆధునిక మానవుడికి ఆధ్యాత్మిక గురువు అవసరమా అనే అంశంపై చర్చించుకుంటున్నాము.*

 ఆధ్యాత్మిక అనేది లోతైన తెలియని అనంతమైన మహాసముద్రం వంటిది.ఆ మార్గంలో ప్రవేశించడం చాలా సులభం .పరిణితి చెందడం బహు కష్టం. నేడు ఆధునిక మానవుడు మానవ సంబంధాలకు  తిలోదకాలిస్తూ , ఆర్థిక సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుత సమాజంలో  మనుషులు తన అవసరాలకు మించిన విలాసాలకు బానిస అవుతున్నారు. అందుకే ఈ డబ్బు కోసం పరుగు .ఈ పరుగులో తాను మానసికానందాన్ని ,శాంతిని, ఆత్మ తృప్తిని పొందలేక , తాను పొందే భౌతిక వస్తు సంపదే నిజమైన జీవితం అని భ్రమిస్తున్నాడు.

 *మనం పరుపును కొనగలం కానీ, నిదురను కొనలేము. అలాగే ఎంత సంపద ఉన్న కడుపు మించి తిండిని తినలేము. ఈ రెండు సత్యాలకు మనిషి మరిచిపోయి,  రెండు కారాలకు బానిసవుతూ మనసులో అశాంతిని సృష్టించుకుంటున్నాడు. ఆ రెండు కారాలే ఒకటి మమకారం రెండోది అహంకారం. ఈ రెండు కారాలు తగ్గినప్పుడే మనిషి అంతర్గతంగా ఆధ్యాత్మిక పరిణితి చెందుతాడు. అవి తగ్గాలంటే  మనిషికి ఆధ్యాత్మిక మార్గం ఒకటే శరణ్యం*.

 ఆధ్యాత్మికత అంటే ఆత్మకు దైవానికి సంబంధించిన ఆలోచన. ఆత్మ జ్ఞానాన్ని, శాంతిని ,విశాల దృక్పథాన్ని దైవ చింతన ద్వారా పొందడం.

 *ఇక ఆధునిక మానవునికి ఆధ్యాత్మిక గురువు అవసరమా అనే ప్రశ్న ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది .మనిషి జీవితంలో విద్యకు గురువు ఎంత అవసరమో, ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనకు మార్గదర్శకుడు అంతే అవసరం .పుస్తకాలు జ్ఞానాన్ని ఇస్తాయి .కానీ అనుభవాన్ని ఇవ్వలేవు. జీవితంలో నిరాశ ,కోపం ,అసూయ ,భయం అభద్రతాభావం ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చెప్పేవాడే ఆధ్యాత్మిక గురువు. ఆయన కేవలం మంత్రాలు చెప్పేవాడు కాదు. మనలోని బలహీనతలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వ్యక్తి*.

ఇప్పటి సమాజంలో చాలామంది ఒత్తిడి ఆందోళనతో కూడిన జీవితంలో శాంతి లేక  అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ధనం పెరుగుతుంది కానీ మనశ్శాంతి తగ్గుతుంది.

 *ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక గురువు మనిషికి ఎంతో అవసరం. అతను అంతర్ముఖ దృష్టిని నేర్పిస్తాడు. సంతోషం బయట లేదు. మనిషి అంతరంగంలోనే ఉంటుంది .అనే సత్యాన్ని అవగాహన చేయిస్తాడు.  ధ్యానం ,సేవ, ప్రేమ, క్షమ లాంటి విలువలతో కూడిన విశాలమైన ఆధ్యాత్మిక అంశాలను జీవితంలో ప్రవేశ పెట్టడానికి ప్రేరేపిస్తాడు*.

 గురువు అంటే శంకరాచార్యులు వారి గురువు గోవింద భగత్పాదులును వివేకానంద గారి గురువు శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి వారు కావాలి .అయితే ప్రతి గురువు నిజమైన గురువు అనుకోవడం సరైనది కాదు.

 నేడు అనేకమంది గురువుల పేరిట మఠములు సంస్థానాలు స్థాపించి ఆస్తులను వెనక వేసుకొని మోసాలతో విలాసాలతో అనుభవిస్తున్నారు .పండిత పామరుజనులను 
మాయమాటలతో మభ్యపెడుతున్నారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్త వహించాలి.

*ఎక్కువగా అసలు గురువు అంటే మనం చెప్పుకోవాలంటే నడిచే దేవుడుగా పేరు పొందిన మహనీయులు  ప్రసిద్ధులు మాన్యులు కంచి కామ కోటి పీఠం 68వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములవారు గురించి చెప్పుకోవాలి.వారి జీవితమంతా ఎక్కడకి వెళ్లిన కాలి నడకనే వెళ్లేవారు. అటువంటి గురువులు నేడు మనకు చాలా అవసరం ఉన్నది*

అయితే కొంతమంది మనకు పుస్తకాలు ఇంటర్నెట్ ఉన్నప్పుడు గురువు ఎందుకు అని ప్రశ్నిస్తారు. కానీ ఇంటర్నెట్ సమాచారం ఇస్తుంది ,అది ఇచ్చే సమాచారం ప్రతిదీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము. కానీ గురువు నీ ఎదుట, నీ మనసును గ్రహించి నీలో ఏ విధంగా పరివర్తన తేవాలో  అలా ప్రయత్నించి సఫలీకృతం  అవుతాడు .

ఈ చర్చలో అవసరం లేకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి  కొన్ని విషయాలు ఆధ్యాత్మికతకు తోడైన మన సంస్కృతి గురించి కూడా ఒకసారి చర్చిద్దాం 

*గతంలో విద్యా విధానంలో గురువులు పిల్లలను దండించినప్పుడు పెద్దలు ఇంకా దండించిందనే వారు, కానీ నేడు మాస్టారులు  పిల్లల్ని దండించినట్లయితే మా పిల్లలను మేము ప్రేమగా పెంచుకుంటున్నాము మీరు ఎందుకు దండిస్తున్నారు మీ పని పాటల చెప్పడమే అనేటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే నేటి పిల్లలకు నీతి సంస్కృతి సాంప్రదాయాలు లోపించాయి వారిలో నైతిక బాధ్యత సమాజం మీద గౌరవం పెద్ద పెద్ద పట్ల గౌరవం దేశభక్తి మాతృభూమిపై ప్రేమ ఏమీ లేవు, వారికి కావలసింది  వారు కోరుకున్నటువంటి స్వేచ్ఛ అంటే వికృతమైన భావాలతో సెల్ ఫోన్లు అశ్లీలమైనటువంటి ప్రోగ్రాములు అందుకు తోడుగా నేడు బహిర్గతంగా వచ్చుచున్న అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ చిన్నారుల మీద ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని నా భావన. మన్నింతురు గాక. అయినా ఎనిమిదవ తరగతి చదువుతున్న చిన్నపిల్ల 9వ తరగతి చదువుతున్న పిల్లవాడితో ప్రేమ రామాయణం ఏమిటి సిగ్గుగా లేదా, తల్లిదండ్రులకు పిల్లలకు ఏమిటి ఆ దుస్తులు సగం మిడ్డీలు మోకాళ్ళపైకి దుస్తులు మగవాళ్లకు జుట్టు కటింగులు , చినిగిన జీన్స్ ప్యాంటు, ఆడపిల్లలకు కట్టుబొట్లు జుట్లు లేనేలే లేవు. పైగా ఏమిటి నిజమైన పచ్చబొట్లు కాకుండా టాటూలంటూ శరీరంలో ఎక్కడబడితే అక్కడ పొడిపించుకుంటున్నారు విపరీతమైనటువంటి వికృతమైన రూపాలున్న కట్టుబొట్టు లేనటువంటి సాంప్రదాయం ఈ సమాజం ఎటువైపు వెళుతున్నది మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము అనే సంగతి నేటి తల్లిదండ్రులు కూడా మర్చిపోయారు ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చెడగొడుతున్నారు. నేనీ మధ్య ఒక పార్కులో చూశాను యుక్త వయసులో ఉన్నటువంటి కూతురు తల్లి ఇద్దరు కూడా పొట్టి దుస్తులతో అందాల నారబోస్తూ నడుస్తున్నారు. వారిని ఏమనాలి అందరూ వారి వైపునే చూస్తున్నారు. ఇది మంచిదా అని అందామనుకున్నాను .అంటే వారు నాపై యుద్ధం ప్రకటిస్తారో అని భయపడ్డాను. ఇలాంటి సంగతులు సంఘటనలు ఎన్నో హజరుగుతున్నాయి నిజంగా తల్లిదండ్రులు వారు ఎంతసేపు వారు సంపాదన వారి స్వేచ్ఛ వారి టీవీ సీరియల్ వారి సెల్ఫోన్లో తప్పితే పిల్లలు పట్టించుకోవడం లేదు. పిల్లలు రేపటి భవిష్యత్తుకు పునాదులు అనే మరిచిపోతున్నారు. అలాగే నేటి సామాజిక మాధ్యమంలో వస్తున్న బిగ్బాస్ జబర్దస్త్ లాంటి కార్యక్రమాలలో శృంగారపూరితమైన భావాలు సన్నివేశాలు నేటి సినిమాలతో పాటు ప్రభావితం చేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేశం లేదు. నేటి సినిమాలలో కూడా బెడ్డు ముద్దు మామూలు అయిపోయింది తొలిచూపులో ప్రేమలు డేటింగులు చాటింగులు అవి వద్దని చెప్పేటువంటి ఎలాంటి కార్యక్రమాలు రావడం లేదు. మాలాంటి చాదస్తుల మనోభావాలు తప్ప.కాబట్టి అన్యధా భావించక మమ్ము క్షమించి ఇకనైనా  మీ పిల్లలు ఏమి చేస్తున్నారు అని కొంతవరకైనా వారిపై నియంత్రణ చేయగలరని నా మనవి. నా పనికిరాని మాటలతో మిమ్మలను బాధిస్తే నన్ను క్షమించండి. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున వేస్తుందా, ఆలోచించరు గాత, మాన్యులు పెద్దలందరికీ నా మనవి*

*మరొక విషయం అన్యధా భావించవద్దు పవిత్రమైన భారత దేశంలో ఉంటూ భారతీయతను వ్యతిరేకిస్తూ ఈ దేశం మాది కాదనుకుంటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశ సంపదను అనుభవిస్తూ విదేశీ సంస్కృతికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మన సోదరులందరికీ ఒక మనవి మీరు ఇదే విధంగా మీ మతపరమైన దేశాలలో స్వేచ్ఛగా ఉండగలరా ఆలోచింతురు గాక ,ఇది సనాతనమైనటువంటి అందరిని ఆదరించేటువంటి ఒక సహృదమైన జాతీయతతో నిండిన వాతావరణంలొ చల్లగా చక్కగా మీరు ఆమోదిస్తూ అందరం ఆనందంగా ఉండు గాక. అలా కాదంటే మీ భావాలు తల్లి పాలు తాగి తల్లు రొమ్మును గుద్దినట్లుగా ఉంటుంది కదా ఆలోచించరు గాక*

మనం కూర్చున్న చెట్టుకొమ్మను మనమే నరుక్కుంటే మనకే ప్రమాదం. మాన్యులు నేను చెప్పిన మాటలలో మంచిని గ్రహించుదురుగాక. అర్ధాలు తీయరు కదా మీకు ధన్యవాదాలు

ఇక అసలు విషయానికి వద్దాం
*ఒక మెడికల్ పుస్తకంలోని ఆపరేషన్ ఎలా చేయాలో గురించి చదివినంత మాత్రాన మనం మామూలుగా ఆపరేషన్  చేయలేము కదా ,అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినంత మాత్రాన జీవన సత్యాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొందలేము. అనుభవజ్ఞుడైన గురువు గారి మార్గదర్శకత్వం ,మన ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు* .

*కనుక మనము గురు పరంపరలో చెప్పుకోవలసిన మహాత్ములు గౌతమ బుద్ధుడు వర్తమానవీరుడు మరాఠా వీరుడు శివాజీ గారి గురువుగారైన సమర్థ రామదాసు  రామానంద స్వామీజీ కబీరు గురునానకు తులసీదాసు వల్లభాచార్యులు చైతన్య మహాప్రభు స్వామి దయానంద సరస్వతి వీరందరూ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది* 

అలాగే పురాతన ప్రముఖులలో వ్యాసుడు పతంజలి చాణుక్యుడు వశిష్ఠుడు వీరి గురించి కూడా చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది 

*తరువాత వేదాలపరంగా గొప్ప గురువులు శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు వారు* 

*అలాగే ఆధ్యాత్మిరంగంలో చెప్పుకోదగ్గ గొప్ప గురువులు రమణ మహర్షి కర్ణాటకలో శివయోగి మహారాజ్  బసవన్న విద్యారణ్య స్వాముల వారు తమిళనాడులో తిరువళ్లువర్ నమ్మల్వార్  ఆండాళ్ లను గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది*

*అలాగే ఆంధ్ర నాట వీరబ్రహ్మేంద్రస్వామి ,వేమన, పుట్టపర్తి సత్యసాయి బాబా గురించి చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది*

కనుక మనము ఆధ్యాత్మిక గురువును ఎంపిక చేసుకునే సందర్భంలో వారి గత చరిత్ర వారి వ్యక్తిగత విషయాలను కూడా కూలంకుషంగా చర్చించి వారి గత అనుభవాన్ని పురస్కరించుకొని వారిని గురువుగా మనం ఎన్నుకోవాలి అని నా ఆలోచన. ఈ విషయంలో ఆధ్యాత్మిక వాదులంతా వారుగా నిజానిజాలు తెలుసుకోగలరని మనవి. 

 *సర్వేజన సుఖినోభవంతు*
 *ఓం శాంతి శాంతి శాంతి ః*

*రాఘవ మాస్టారు కేదారి* 🙏
 డిగ్రీ కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్
 జాతీయ తెలుగు పరిరక్షణ సమితి అధ్యక్షులు 
హైదరాబాద్/ గుడివాడ 🌹
6362973252

No comments:

Post a Comment