*దేవుడిని చూడటం అద్భుతం కాదు....*
నేను ఇతరము అనే భ్రమ ను చూడగలగటమే...
అత్యంత ఆశ్ఛర్య అద్భుతము. ఈ విభజన భ్రమ తొలగటమే ముక్తి.
మనశ్శాంతికి మార్గం ఏది ?
నీ ఆలోచనలను...ధీర్ఘకాలం నిద్రలో పడుకోనీ....అదే శాంతి మార్గం.
ఇంద్రియ సుఖాలన్ని, ఉప్పు నీటివంటివి, ఎంత అనుభవించినా దాహం తీరదు, తృప్తి కలగదు. అందుకనే ఈ మనసనే దానిలో ఏ కోరిక వేయకుండా ఉండటమే తెలివైన పని, మనసుని ఎంత నింపినా ఖాళీ ఐపోతుంది కానీ నిండదు.
తాళం తీయాలంటే, బలం పనికిరాదు, దానిలోపల తత్వం తెలిసిన తాళంచెవి కావాలి. నీ ప్రయత్నం శక్తి ని వృద్ధి చేసుకోవటం కాదు, అంతరం ఎలా నిర్మితమై ఉందో తెలుసుకోవాలి.
నీవు జీవించి ఉండటమే, అద్భుతాశ్ఛర్యము, అంత కన్నా గొప్ప వింత లేదు. ఈ జీవితం దొరికినందుకు సంతోషించు, పరవశించు. ఈ విధంగా ప్రతి శ్వాసలో ఆనందం పొందుతూ, జీవితాన్ని ఉత్సవంగా సంబరంలా జీవించు.
మనము ఏదైతే బాగు చేయలేమో, అనుకున్న లక్ష్యం, స్థాయి, స్థితులను, పొందలేదో, వాటి కోసం, పదే పదే తపిస్తూ, చేసిన ప్రయత్నాలనే, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము. ఏ సారము లేకపోయినా అలవాటు మారదు, భ్రమ తొలగదు.
"ఒక పని చెయ్యగల "సమర్థత" ఉన్నవాడు నిశ్శబ్దంగా "ఆ పనిని" చేసుకుపోతాడు. ఆ సమర్థత "లేనివాడు" మాత్రం ఆ పనిని ఎలా చెయ్యాలో "చెబుతూ" కూర్చుంటాడు.
ఒకరి మాటలు విని మరొకరిపై ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎందుకంటే మనం కంటితో చూడనివి, చెవితో విననివి చాలా ఉంటాయి కదా..!
No comments:
Post a Comment