Wednesday, June 3, 2026

 


*లక్షల జీతం కంటే మనశ్శాంతే ముఖ్యమని ఐటీ ఉద్యోగానికి గుడ్‌బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త జీవితం!* 

ఈరోజుల్లో ఐటీ ఉద్యోగం అంటే లక్షల జీతం, ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులు, విలాసవంతమైన జీవితం అనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఆ మెరుపుల వెనక ఉన్న ఒత్తిడి, టార్గెట్లు, రాత్రింబవళ్లు పని చేసే పరిస్థితులు ఎంతమందిని మానసికంగా అలసటకు గురి చేస్తున్నాయో తాజాగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చెబుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లోనే బెంగళూరుకు చెందిన ఓ మహిళ ధైర్యవంతమైన నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో మంచి జీతం వచ్చినా, మానసిక ప్రశాంతత మాత్రం దొరకలేదని తెలిపింది. రోజుకు గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, నిరంతర ఒత్తిడి, టార్గెట్లు, మీటింగ్స్ వల్ల తీవ్ర మానసిక అలసటకు గురయ్యానని పేర్కొంది. దీంతో తన జీవితాన్ని తాను నియంత్రించుకునేలా కొత్త మార్గాన్ని ఎంచుకుందట.

ఇప్పుడు ఆమె బెంగళూరు నగరంలో ఆటో నడుపుతూ తనకు నచ్చిన సమయాల్లో పని చేస్తోంది.

No comments:

Post a Comment