Wednesday, June 3, 2026

 అంపైర్ ను తెలుగులో  ఏమంటారు ?
........................................

సూపు చేయువాడు సూపకారుడు. తెలుగులో సూపు అంటే పప్పు అని అర్థం. అన్నంపప్పు అంటాం కదా ఆ పప్పే సూపు. సూపకారుడు అంటే వంటవాడనే అర్థం కూడా ఉంది. అయితే తెలుగు సూపు నుండే ఆంగ్ల Soup పుట్టిందనడానికి భాషాశాస్త్ర ఆధారాలు లేవు. Soup అనే పదం లాటిన్ suppa నుంచి ఫ్రెంచ్ ద్వారా ఆంగ్లంలోకి వచ్చింది.

(1) మన్మథుడు సంధించే బాణాలు ఐదు.అవేమిటంటే  అరవిందము అశోకము చూతము నవమల్లిక నీలోత్పలము. 
వీటి వల్ల కలిగే అవస్థలే ఉన్మాదన తాపన శోషణ స్తంభన సమ్మోహన.  

(2) శివుడికి పంచముఖుడనే పేరుంది. ఆ ఐదు మోములేమిటంటే. ఈశానము తత్పురుషము అఘోరము వామదేవము సద్యోజాతము. 
ఇవి వరుసగా ఊర్ధ్వ తూర్పు దక్షిణ ఉత్తర పశ్చిమ దిక్కులకు అధిపతులు.  

(3) ఉన్మాదము అంటే పిచ్చి.వెర్రి అని అర్థం. ఉన్మాది అంటే పిచ్చివాడు.

(4) ఆప్తుడు అంటే హితము కోరేవాడు, నమ్మదగినవాడు, మిత్రుడు అని అర్థం. అంతే కాని రహస్యములను దాచివుంచువాడు కూడా.

(5) అనాథశరణాలయంఅనేదే సరైన రూపం. అనాథ = నాథుడు లేనివాడు, దిక్కులేనివాడు. అనాధ అంటే ఆధారము లేనిది అని అర్థం. 

(6) ఆయుర్వేదము అనగా ఆయుష్షును గూర్చిన జ్ఞానం. ఆయుః + వేద = జీవిత విజ్ఞానము. ఇది కేవలం ఆయుష్షును పెంచే మార్గం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే రోగాలను నయం చేసే సంపూర్ణ వైద్యశాస్త్రం.  

(7) అతివ అంటే శ్రేష్ఠురాలు  ఉత్తమురాలు అని అర్థం. అతి + వ = మిక్కిలి శ్రేష్ఠమైనది. మంగళకరమైన వస్తుసముదాయం కలది. పుణ్యస్త్రీ అని కూడా అర్థం .  

(8) అనంతుడు అనగా అంతము లేనివాడు నాశనం లేనివాడు. ఇది విష్ణువుకు శేషునికి కూడా పేరు. అనంతశయనుడు అంటే అనంతుడు అనే శేషువుపై శయనించువాడు అనగా విష్ణువు. శేషువును శేషువు అనరాదు శేషుడు లేదా ఆదిశేషుడు అనాలి.  

(9) అంకకారుడు అనగా నియమావళి ప్రకారం ఆటలో గెలుపోటములు నిర్ణయించి ఆటను నడుపువాడు. అంటే అంపైర్‌.

(10) తారాపథము అనగా నక్షత్రముల మార్గము.ఆకాశము అని అర్థం. పథము అనగా దారి. ధరలు రాకెట్‌లా తారాపథంలోకి దూసుకువెళుతున్నాయి అనడం సమంజసమే.

అనాథ = నాథుడు లేనివాడు, తల్లిదండ్రులు గానీ ఆదరించి పోషించువారు గానీ లేనివాడు.  
అనాధ = ఆధారము లేనిది.

కాబట్టి మీ దానధర్మాలు అనాథాశ్రయానికి ఇవ్వాలి.అనాధాశ్రయానికి కాదు.  

.........సేకరణ....... జి.బి.విశ్వనాథ M. A, 9441245857, అనంతపురం.

No comments:

Post a Comment