జీవితం మారాలా !నిద్రపోవడం ,మేలుకోవడం లోని ఈ దివ్య రహస్యం తెలుసుకో .-master sagar sindhuri
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ehdvbkyOmRc
Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] అందరికీ నమస్కారం సాగర్ సింధూరి గారి YouTube ఛానల్ కు స్వాగతం. గురువుగారు నమస్కారం. మానవులు ఏవేవో చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి మరి అత్యంత ముఖ్యమైన విషయాలు ఏమైనా రెండు చెప్పండి. మనిషి తన జీవితాన్ని మార్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ రెండు అతి ముఖ్యమైన విషయాలు అంటే వేటిని వేటి గురించి తెలుసుకుంటే వేటి గురించి మార్చుకుంటే
(00:46) అతని జీవితం మారడం ప్రారంభం అవుతుంది అంటే దాంట్లో మొదటిది నిద్రపోవడం రెండవది సరిగా మేల్కోవడం అంటే నిద్రపోవడము మేల్కోవడం ఈ రెండు విషయాలు ప్రపంచంఅంతా చాలా సాధారణమైనటువంటి విషయాలు ఇది ప్రతిరోజు జరిగే విషయాలే కదా ఇందులో ఏముంది ఇందులో జీవితం మారేది ఏముంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిద్రపోవడము మేల్కోవడం గురించి తెలుసుకుంటే జీవితం మారడం ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది.
(01:26) మరి నిద్ర అంటే ఏంటి? మెలకు అంటే ఏంటి చెప్పండి. మొదటగా నిద్రపోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. అందరూ అనుకుంటారు నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకోవడం శరీరానికి రిలాక్సేషన్ ఇవ్వడం కానీ నిద్ర పోవడం అంటే మన ఋషులు ఇంకా గొప్ప లోతైనటువంటి రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. మొట్టమొదట మనిషికి ఈ యొక్క ప్రాథమిక అజ్ఞానం ఏంటంటే నేను ఈ దేహాన్ని మాత్రమే అన్నటువంటి అజ్ఞానం జీవితం నాశనం అయిపోవడం అయిపోవడం అనేది ఈ అజ్ఞానం నుంచే ప్రారంభమవుతుంది.
(02:11) తమత్స్వజ్ఞానం విద్ధి దేహినాం సర్వదేహినం అంటే సమస్త దేహములు ఈ తమస్సు అనే అజ్ఞానం చేత బంధింపబడి ఉంటారు. అంటే మొట్టమొదటి అజ్ఞానం ఏంటంటే నేను ఈ బాడీ మాత్రమే అనుకోవడం కానీ ఉపనిషత్తులు ఋషులు సత్యం ఏం చెప్తుందంటే నేను ఆత్మ స్వరూపుని నాకు ఐదు దేహాలు ఉన్నాయి అంటే మనకు ఫైవ్ బాడీస్ ఉంటాయి ఎప్పుడూ కూడా ఈ ఐదు శరీరాలను కలిపి దాంట్లో ఉన్నటువంటి ఆత్మను కలిపి నేను అంటున్నాం.
(02:49) ఇక్కడ నిద్రపోవడం అంటే ఏంటంటే మన యొక్క చైతన్యము అంటే కాన్షస్నెస్ ఈ కాన్షస్నెస్ అనేది కాన్షస్నెస్ అంటే దేన్నైనా తెలుసుకునే శక్తి ఈ చైతన్యం అనేది బాహ్యము నుంచి మెల్లగా తన ఆత్మలోకి లయం అయిపోతూ ఉంటుంది. అంటే చూడండి మనకు ఐదు శరీరాలు ఉన్నాయి ప్రాణమై వర్ణమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఈ ఐదు శరీరాల్లో కాన్షియస్ ఎనర్జీ ఉంటేనే అవన్నీ పని చేస్తాయి.
(03:21) నిద్రపోవడం అంటే ఏంటంటే మెల్లగా ఈ భౌతిక శరీరం నుంచి ప్రాణమయ కోసానికి ప్రాణమయ కోసం నుంచి విజ్ఞానమై మనోమయ కోసానికి మనోమయ కోసం నుంచి విజ్ఞానమయ కోసానికి విజ్ఞానమయ కోసం నుంచి ఆనందమై కోసానికి ఆనందమై కోసం నుంచి ఆత్మలోకి చైతన్యం అనేది కాన్షస్ ఎనర్జీ అనేది విత్డ్రా అయిపోతూ ఉంటుంది. ఉపసంహరించుకొని తన స్వస్థానమైనటువంటి ఆత్మలో లయం అయిపోతుంది.
(03:51) చూడండి నిద్రపోవడం అంటే మొదట ఫిజికల్ బాడీని రిలాక్స్ చేస్తాం. తర్వాత లోపల ఉన్న ప్రాణం రిలాక్స్ అవుతుంది తర్వాత మనసు రిలాక్స్ అవుతుంది ఆ బుద్ధి రిలాక్స్ అవుతుంది తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకొని తానఎవరో కూడా తాను మర్చిపోతాడు. అవును అంటే ఏమి చైతన్యం పూర్తిగా స్పృహ అనేది పూర్తిగా ఆత్మలో లయం అయిపోతుంది. మేల్కోవడం అంటే ఏంటంటే మళ్ళీ ఈ యొక్క చైతన్యము ఆత్మ నుంచి మొదట ఆనందమై కోసానికి అంటే మొట్టమొదట గుర్తింపు అహంకారం అనే గుర్తింపు నేను ఫలానా వాన్నని అని గుర్తింపు వస్తుంది.
(04:30) తర్వాత విజ్ఞానమై కోసం తనను తాను గుర్తిస్తాడు తన ఇంటిని తన పరిసరాలను గుర్తిస్తాడు. తర్వాత మనసు ప్రారంభం అవుతుంది తర్వాత లోపల ప్రాణం కదలిక ప్రారంభం అవుతుంది చివరిగా శరీరం కదలడం ప్రారంభం అవుతుంది దీన్నే పూర్తి మెలుకు అంటాం. అంటే చైతన్యం అనేది ఆత్మ నుంచి ఒక్కొక్క శరీరానికి ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది చివరగా కంప్లీట్ గా ఫిజికల్ బాడీలోకి వచ్చి నువ్వు లేచి నడవగలుగుతావు అంటే నీ ఐదు శరీరాలు పని చేస్తాయి నువ్వు పూర్తిగా దాన్ని మేలుకోవడం అంటాం.
(05:04) కేవలం అందరూ ఏమనుకుంటారుంటే నిద్రపోవడం అంటే ఫిజికల్ బాడీని పడుకోబెట్టడం అవును నిద్ర లేవడం అంటే కళ్ళు తెరిసి ఆ మేలుకోవడం అనుకుంటారు అవును కానీ ఈ రెండిటి గురించి మనం డీప్ గా తెలుసుకోవాలి నిద్రపోవడం అంటే ఏంటి మేల్కోవడం అంటే ఏంటి నిద్రలో ఏం జరుగుతుంది మేలుకోవలో ఏం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పాను నిద్ర గురించి తెలుసుకుంటే మెలుకవ గురించి తెలుసుకుంటే జీవితం మారడం ప్రారంభం అవుతుంది అని అవును ఎలా ఎలా అంటే చూడండి నిద్ర అంటే మన చైతన్యము ఆత్మలో లయం అయిపోవడం అంటే మన సృష్టిని స్థితిని లయాన్ని అంటే
(05:49) భగవంతుని యొక్క సృష్టిని లయాన్ని పోల్చుకుంటే గనుక భగవంతుడు సృష్టిస్తాడు మళ్ళీ సమస్తాన్ని లయం చేసుకుంటాడు తనలోనే మళ్ళీ ఇంకొక సృష్టి మళ్ళీ ప్రారంభం అవుతుంది అట్లా అట్లా ప్రతి మనిషికి కూడా తన ప్రపంచాన్ని తాను సృష్టించుకున్నటువంటి ప్రపంచాన్ని తాను జీవించే ప్రపంచము ప్రతిరోజు లయం అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది.
(06:16) కానీ ఇక్కడ ఏంటంటే మనిషి ఈరోజు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి అలవాట్లు ఎలాంటి బాధలు ఎలాంటి ఆ ఆత్మ సందేహాలతో జీవిస్తూ ఉంటాడో రేపు నిద్ర లేచిన తర్వాత అదే మనిషే కంటిన్యూ అవుతాడు. అవే ఆలోచనలు ఉంటాయి అవే అలవాట్లు ఉంటాయి అవే ప్రవర్తన ఉంటుంది అటువంటి జీవితమే ఉంటుంది. అంటే నిన్న ఎలాంటి జీవితం ఉందో ఈరోజు కూడా అలాంటి జీవితమే ఉంది.
(06:43) అవును ఏ మార్పు మారలేదు మరి మనిషి మారాలంటే ఆలోచనలు మారాలి తన అలవాట్లు మారాలి ఆ తన యొక్క మాటలు మారాలి ప్రవర్తన మారాలి తను చేసే పనులు మారాలి. ఇవన్నీ మారితేనే జీవితం మారింది అంటాం. కానీ మనం ఎలా నిద్ర లేస్తున్నాం అవే థాట్స్ తో అదే బిహేవియర్ తో కొన్ని సంవత్సరాలుగా అలాగే నిద్ర లేస్తున్నాం. మరి ఇది ఎలా మారుతుంది ఇది మారాలంటే ఎలాగా నేను రేపు పొద్దున్న నుంచి నిద్ర లేస్తానే ఒక కొత్త వ్యక్తిగా కొత్త శక్తివంతుడిగా కొత్త ఉత్సాహం కలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా ఏదో ఒక గొప్ప ఆస్పిరేషన్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను నిద్ర లేవాలి చాలా ఉత్సాహంగా నిద్ర
(07:24) లేవాలి. నాకు ఒక కొత్త డేని కొత్త రోజుని నేను సృష్టించుకోవాలి నా ప్రపంచం పాతది చాలా చండాలంగా ఉంది. అది బాధలతోన దారిద్రంతోన అనారోగ్యంతోనూ ఆ ఎటువంటి సంతోషము సంతృప్తి లేకుండా నా ప్రపంచం ఉంది ప్రస్తుత ప్రపంచము మరి ఈ ప్రపంచాన్ని నేను మార్చుకుని సరికొత్త దివ్యమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకోవాలి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే నువ్వు సరిగా నిద్రపోతేనే నిద్రపోయ అంటే ఏంటంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో నిద్ర గురించి మరణం గురించి ఒక శ్లోకం ఉంటుంది ఇక్కడ నిద్రపోవడం అంటే ఒక చిన్న మరణం లాంటిదే పూర్తిగా అలామయపోవడం మేల్కోవడం అంటే మళ్ళీ
(08:10) పునర్జన్మించడం లాంటిదే భగవద్గీతలో యంపిస్మరన్ భావం తజతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అంటే ఏంటంటే దేహాన్ని వదిలేసేటప్పుడు మరణ సమయంలో ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి సంస్ సంస్కారాలతో దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనిషి దేహాన్ని వదిలేస్తాడో తరువాతి జన్మ అలాంటి సంస్కారాలు అలాంటి అలవాటు అలాంటి ఆలోచనా విధానాలు ఉన్నటువంటి జన్మనే లభిస్తుంది.
(08:45) అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. అంటే మనం నిద్రపోయే ముందు అంటే ఇక్కడ మరణించే ముందు ఎలాంటి భావాలు కలిగి ఉంటామో ఒకవేళ దుఃఖము హేయమైనటువంటి భావాలు ఇలాంటివి భయము ఇలాంటి భావాలు ఉంటే తర్వాతి ఉత్తర జన్మ కూడా అలాంటిదే ఒక కీటకంగానో పశుపక్షాదులు గానో ఇలాంటి ఎప్పుడు భయంతోనో అల్లాడిపోయే జీవితం లభిస్తుంది. ఇక్కడ ఈరోజు మనం మన ప్రపంచాన్ని లయం చేసుకుంటున్నాం.
(09:17) మనం తాత్కాలిక మరణాన్ని పొందుతున్నాం. మరి మరణించే ముందు అంటే నిద్రలోకి వెళ్లే ముందు లయం చేసుకునే ముందు మనం ఎటువంటి ఆలోచనలు అంటే పరమ పవిత్రమైనటువంటి ఆలోచనలతో మనము నిద్రలోకి వెళ్ళాలి. అంటే నేను సర్వశక్తివంతుని నేను ఈ యొక్క దేహాన్ని కాదు నేను ఈ ఐదు దేహాలను నియంత్రించే పరమాత్మ స్వరూపాన్ని నేను సర్వశక్తివంతుని నేను దేన్నైనా సాధిస్తాను నా భవిష్యత్తు పరమాద్భుతంగా ఉంటుంది.
(09:47) నేను రేపటి నుంచి అత్యంత ఉత్సాహంగా పని చేస్తాను నా యొక్క ప్రతి లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను నా జీవితాన్ని పది మందికి ఉపయోగపడేలాగా నేను తీర్చి దిద్దుకుంటాను. నా రేపు నా రేపటి యొక్క సృష్టి చాలా పరమోత్కృష్టంగా ఉండబోతుంది. నేను పరమ శక్తివంతునిగా ఉంటాను అనుకుంటూ స్మరణ చేస్తూ ఒక దివ్యమైన ప్రపంచాన్ని జీవితాన్ని ఊహించుకుంటూ నువ్వు నిద్రలోకి జారుకుంటే గనుక నీ యొక్క తర్వాతి సృష్టి అంటే రేపటి మెలుకవు కూడా అదే పాయింట్ నుంచి ప్రారంభం అవుతుంది.
(10:20) అంటే నువ్వు ఎక్కడ నిలుపుతావో నీ ప్రయాణం మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. కానీ ఎలా నిద్రపోతున్నాం మనము ప్రతి ఒక్కళ్ళు రాత్రి 12 1:00 గంట వరకు మొబైల్ స్క్రీన్ చేసుకుంటూ భయంకరమైనటువంటి వీడియోలు చూసుకుంటూ లేదా హింసాత్మకమైనవి ఆ మనసును కల్లోల పరిచేవి అనేక బాధలను స్మరించుకుంటూ రేపు ఎలా ఉండబోతుందో ఎంత భయంకరంగా ఉండబోతుందో అనుకుంటూ నిజానికి రేపు సృష్టించుకునే ప్రపంచానికి కావలసిన రా మెటీరియల్ ని సర్వ సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు.
(11:01) నువ్వు ఎంత దివ్య భావాలతో ఎంత పరమ ప్రశాంతతో నువ్వు నిద్రపోతావో నీ రేపటి మెలుకువ అంటే రేపటి సృష్టి అంతా ప్రకాశవంతంగా జరుగుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు యోగ నిద్ర అంటే శవాసనంలో పడుకొని ప్రశాంతంగా ప్రతి ఒక్క శరీర భాగాల్ని అలాగా రిలాక్సేషన్ చేస్తూ మంచి భావాలతో భగవంతుని స్మరించుకుంటూ ఆయన చెప్పారు ప్రతి చేష్టలో కూడా ప్రతి కర్మలో కూడా నన్నే స్మరిస్తూ కర్మ చేయి కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు నిద్ర పోయేది కూడా ఒక కర్మనే చాలా గొప్ప కర్మ ఇది నీ రేపటి భవిష్యత్తు నిర్మించుకోవడానికి
(11:46) దివ్యమైన కర్మ ఇది చాలా ముఖ్యమైన కర్మ మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి కర్మ యందు కూడా భగవంతుని స్మరణతోనో దివ్య స్మరణతోనో మనం నిద్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక మేల్కోవడం అనేది మేల్కోవడం అంటే కేవలం శరీరాన్ని లేపడం కాదు శరీరము యక్టివేషన్ లో ఉండాలి ప్రాణము 72వ000 నాడుల్లోనో ప్రవహించాలి సవ్యంగా నీ కాళ్ళలోకి చేతుల్లోకో ప్రాణం ప్రవహించలేకపోతే నీ కాళ్ళు లేచి నిలబడలేవు నీ తలలోకి సరిగా ప్రాణం ప్రవహించలేకపోతే నీ తలలో ఉన్న ఏ అవయవము పని చేయదు.
(12:22) అలాగే నీ మనసులోకి చైతన్యం ప్రవహించకపోతే మనసు గందరగోలం అయిపోతుంది ఏం ఆలోచించలేవు నువ్వు నీ బుద్ధిలోకి చైతన్యం సరిగా ప్రవహించకపోతే నీ బుద్ధి సరైన నిర్ణయాలు తీసుకోలేదు అంటే జీవితం ఎప్పుడూ కూడా గందరగోళంగానే ఉంటుంది. మేల్కోవడం అనేది కూడా సరైన సమయంలో ఎప్పుడు మేల్కుంటే మన ఐదు దేహాలతో పాటు ఆత్మ పరివ్యక్తమైనటువంటి చైతన్యంతో ప్రకాశిస్తుందో అంటే ఎప్పుడు మేలుకుంటే మనం ఫైవ్ బాడీస్ ఫుల్ యక్టివేషన్ లో ఉండి చాలా ఉత్సాహంగా మనం నిద్ర వేస్తామో ఆ సమయంలోనే మేలుకోవాలి.
(13:03) అంటే ఉదయం మేల్కోవడానికి ఒక ఈ యొక్క విశ్వం సృష్టించినటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయంలో మేలుకుంటేనే ఆ మెలుకు అనేది సరిగ్గా జరుగుతుంది. మేల్కునే ముందు మేలుకున్న తర్వాత నువ్వు మొదటి ఆలోచన కచ్చితంగా ఏది వస్తుందంటే నువ్వు రాత్రి ఏ భావం అయితే ఆలోచిస్తూ నిద్రపోయి ఉంటావో అలాంటి ఫ్రీక్వెన్సీతోనే మనం నిద్ర లేస్తాం.
(13:30) అంటే అదే ఉత్సాహంతో నిద్ర లేస్తాం అదే థాట్ ఫ్రీక్వెన్సీతో నిద్ర లేస్తాం. కాబట్టి నిద్ర లేచిన తర్వాత మొదటి ఆలోచన అనేది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదంతా మన లైఫ్ ని కన్స్ట్రక్టివ్ గా చేసుకోవడానికి చేయాలి. కాబట్టి ఇది మనం నిద్ర లేవడము మేల్కోవడం ఎంతమంది ఈ విధంగా నిద్ర లేస్తున్నారు మేల్కుంటున్నారు. ప్రపంచంలో దాదాపుగా ఈ నిద్రపోవడము, మేల్కోవడం అనే దాని గురించి ఎవరికీ సరిగా తెలియదు.
(13:58) కానీ నేను చెప్పినట్టు నువ్వు నిద్రపోయినా నేను చెప్పినట్టు నువ్వు మేలుకున్న నీ జీవితం ఆ క్షణం నుంచే ఆ రోజు నుంచే గొప్ప పరివర్తనం తీసుకుంటుంది
No comments:
Post a Comment