నీ మైండ్ నిన్ను మోసం చేస్తోంది ఒక్కసారి విను | Stop Cheating Yourself | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2YyGsXXOP3Q
Transcript:
(00:04) [సంగీతం] మీరు రోజు పొద్దున్నే లేచి పూజ గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని పూజ చేస్తూ ఉంటారు. నిజం చెప్పండి మీకు ఆ పూజ గదిలో ప్రశాంతత దొరికిందా? లేదు ఎందుకంటే మీరు చేస్తున్నది పూజ కాదు. అదిఒక పార్ట్ టైం జాబ్. ఉదయం ఒక అరగంట దేవుడితో డీల్ మాట్లాడుకొని మిగతా 23న్నర గంటలు అదే కుళ్ళు అదే ఈర్ష అదే ఆందోళనతో బ్రతికేస్తున్నారు.
(00:29) అలాంటప్పుడు మనందరం ప్రశాంతంగా ఎలా ఉంటాము? ఇలాంటి నకిలీ పూజల్ని ముక్కలు చేయడానికి ఒకాయన వచ్చాడు. ఆయన పేరే జిడ్డు కృష్ణమూర్తి. ఆయన మిమ్మల్ని హిమాలయాలకు వెళ్ళమనలేదు, కాషాయ బట్టలు కట్టమనలేదు. ఆయన చెప్పింది ఒకటే మీరు ఏ ముసుగు లేకుండా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకునే ధైర్యం మీకు ఉందా అని అడిగారు. సమస్య ఎక్కడుందో తెలుసా మీరు ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడట్లేదు.
(00:51) మీరు పుట్టినప్పటి నుంచి మీ తలలో కొన్ని వందల అభిప్రాయాలు నమ్మకాలు, కులాలు, మతాలు కుక్కేశారు. ఒక మనిషిని చూడగానే ఆయన మంచోడు, ఈయన చెడ్డోడు, ఆమె ఏ క్యాస్ట్, ఈయన మనవారేనా లేకపోతే పక్కదేశం వాడు అంటూ మీ మైండ్ వెంటనే ఒక లేబుల్ వేసేస్తుంది అది కూడా ఒక మనిషి మీద అంటే మీలాగా పుట్టిన మనిషి మీద. మీరు చూస్తున్నది ఎదురుగా ఉన్న మనిషిని కాదు.
(01:18) మీ తలలో ఉన్న మీ పాత నమ్మకాల నీడని ఈ జడ్జిమెంట్లు, ఈ పోలికలు మీ జీవితాన్ని నరకం చేస్తున్నాయి. పక్కింటివాడు కారుకుంటే మీకు మంట మొదలవుతుంది. ఒకవేళ మీతో చదువుకున్న మీ క్లాస్మేట్ కి ఎక్కువ జీతం వస్తే మీకు నిద్రపట్టదు ఎందుకంటే మీ మైండ్ ఎప్పుడు మిమ్మల్ని ఇంకొకరితో పోల్చి చూస్తూనే ఉంటుంది. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఎక్కడైతే పోలిక ఉంటుందో అక్కడ హింస మొదలవుతుంది.
(01:45) మీతో మీరు యుద్ధం చేస్తున్నారు. సమాజం మిమ్మల్ని ఒక రేసు గుర్రంలా మార్చేసింది. మీరు కూడా ఆ పరుగు పందంలో పరిగెడుతూ దానికి సక్సెస్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. కానీ లోపల మాత్రం విపరీతమైన ఒంటరితనం చెప్పలేని అశాంతి మీరు ఎంత సంపాదించినా ఏ పొజిషన్ కి వెళ్ళినా ఆ లోపల శూన్యత మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే [సంగీతం] మీకు తెలియకుండానే మీరు రేస్ లో ఉన్నారు.
(02:10) మీకు ఇష్టమైన పని ఒకటి ఉంటుంది. కానీ డబ్బులు సంపాదించడానికి మీరు చేసే పని ఇంకొకటి ఉంటుంది. సో దీన్నే రేస్ లోకి ఎంటర్ అవ్వడం అంటారు. కాకపోతే మనందరికీ అర్థం కాని విషయం ఏంటంటే సమస్య అనేది మన బ్యాంకు బ్యాలెన్స్ లో లేదు అంటే మన దగ్గర తక్కువ డబ్బులు ఉంటే సమస్య కాదు మన ఆలోచన విధానంలో సమస్య ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటో తెలుసా ఐడెంటిటీ [సంగీతం] క్రైసిస్ నేను పక్క వాళ్ళతో సమానంగా ఉండాలి.
(02:35) నా స్నేహితులతో నా కుటుంబ సభ్యులతో వాళ్ళందరూ ఎంత డబ్బులు సంపాదిస్తే నేను కూడా అంత సంపాదించాలి అని చెప్పేసి మీరు మీకు నచ్చిన పనిని వదిలేసి డబ్బులు [సంగీతం] సంపాదించే పనిలో పడతారు. అలా పడటానికి రీజన్ ఐడెంటిటీ క్రైసిస్ కాకపోతే చాలా మందికి క్రికెట్ అవ్వాలని ఉంటుంది. కాకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుంటూ పిల్లల్ని కనేసి వాళ్ళు ఒక జూన్ లో పడిపోతారన్నమాట.
(03:00) మీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే మీరు వాళ్ళని చూసి నేను తప్పు చేస్తున్నానేమో అనవసరంగా క్రికెట్ లో రాణించాలనుకుంటున్నానేమో అని చెప్పేసి మీరు కూడా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ మీ ఫ్రెండ్స్ లాగో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళ ఉంటారు కదా వాళ్ళలాగో బ్రతికేస్తూ ఉంటారు. దానికి కారణం కూడా ఐడెంటిటీ క్రైసిస్ే మీరు గమనించారా [సంగీతం] మీరు రాత్రి పడుకునేటప్పుడు ఎంత భయంతో పడుకుంటున్నారో రేపు పొద్దున ఏం జరుగుతుందో అన్న భయం కెరీర్ ఏమైపోతుంది అనే భయం సమాజంలో నా బరువు పోతుందేమో అనే భయం నిజం చెప్పమంటారా మీరు బ్రతకడం లేదు
(03:33) కేవలం రేపటి గురించి ప్లాన్ చేస్తున్నారు. మీ గతాన్ని మోస్తూ [సంగీతం] భవిష్యత్తును ఊహిస్తూ ఈ క్షణాన్ని పూర్తిగా చంపేస్తున్నారు. జిరుడు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు యు ఆర్ ద వరల్డ్ అని అంటే నువ్వే ఈ ప్రపంచం దీని అర్థం ఏంటో తెలుసా మీరు అమెరికాలో ఉన్నవాడిని చూసి వాడు వేరే అనుకుంటారు ఆఫ్రికాలో ఉన్నవాడిని చూసి వాడు వేరే అనుకుంటారు కానీ ఓడ్కా తాగేవాడైనా గంజి తాగేవాడైనా లోపల ఉండే బాధ ఆకలి ఒంటరితనం భయం అన్నీ ఒక్కటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడి మానసిక స్థితి మీలోనే ఉంది.
(04:08) కానీ మీరు ఏం చేస్తున్నారు గ్రూపులు కడుతున్నారు మనుషుల్ని దేశాల పేరుతో కులాల పేరుతో పార్టీల పేరుతో విడదీస్తున్నారు. ఎక్కడైతే ఈ విభజన ఉంటుందో అక్కడ శాంతి ఎలా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ప్రశాంతత లేదు అనుకుంటారు. కానీ ఆ అశాంతిని క్రియేట్ చేస్తున్నది మీరే. ఎందుకంటే మీ మనసు ఎప్పుడు ఒక పంజరంలో [సంగీతం] బ్రతకడానికి ఇష్టపడుతుంది.
(04:32) ఆ పంజరానికి మీరు నమ్మకం అని పేరు పెట్టుకున్నారు. ఈ సమస్య అంతా ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే మీ మైండ్ చాలా బద్ధకమైంది. దానికి ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేషించే ఓపిక లేదు. అందుకే అది దేన్నైనా చూడగానే ఈజీగా ఒక బాక్స్ లో పడేస్తుంది. ఒక అందమైన పువ్వును చూడగానే మీ మైండ్ ఏం చెప్తుంది [సంగీతం] అది గులాబీ పువ్వు ఇది ఎర్రగా ఉంటుంది అంటుంది.
(04:54) అక్కడితో ఆ పువ్వుని చూడటం మీరు ఆపేస్తారు మీరు చూసింది పువ్వు కాదు మీ జ్ఞాపకాల్లో ఉన్న గులాబీ అనే పదాన్ని మీరు ఒక మనిషిని కలిసినప్పుడు కూడా ఇంతే ఐదు నిమిషాలు మాట్లాడగానే ఆయన గురించి ఒక ముద్ర వేసేస్తారు. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఆ ముద్ర చూస్తారే తప్ప ఆ మనిషిని చూడరు. దీన్నే కృష్ణమూర్తి గారు ది అబ్జర్వ్ అండ్ ది అబ్సర్వ్డ్ అన్నారు.
(05:15) ఇక్కడ గమనించేవారు అంటే మీరు గమనించబడే వస్తువు ఎదురుగా ఉన్నది వేరు వేరు కాదు. మీరు దేన్నైతే చూస్తున్నారో అది మీ మైండ్ లో ఉన్న సమాచారమే మీరు ఒక చెట్టును చూసినా మీ భార్యనో భర్తనో చూసినా మీ శత్రువును చూసినా మీ మైండ్ క్రియేట్ చేసిన ఇమేజ్ ని మాత్రమే చూస్తున్నారు. ఈ ఇమేజ్ వల్లే రిలేషన్షిప్స్ అన్ని నాశనమైపోతున్నాయి.
(05:37) పెళ్లైన కొత్తలో ఉన్న ప్రేమ ఐదేళ్ళ తర్వాత ఎందుకు ఉండదు. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఒకరి గురించి ఒకరు కొన్ని వందల ఇమేజ్లు క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్ ని చూడట్లేదు. ఆ ఇమేజ్ తో కాపురం చేస్తున్నారు. ఇందులో కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? బోరు కొట్టక ఏం చేస్తుంది? ఏ మనిషి అయినా సరే ఎప్పుడూ కొత్తగానే ఉంటారు.
(05:59) మనం మాత్రం ఇంతకుముందు వాళ్ళ గురించి ఏదైతే ఊహించుకున్నామో దాన్ని మాత్రం వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా ఒక సూపర్ మార్కెట్ లో ఒకతను ఒక వస్తువు [సంగీతం] తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఎవరికీ తెలియకుండా మనం ఏమనుకుంటాం అతన్ని దొంగ అనుకుంటాం. నిజం చెప్పాలంటే మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం వేరే పనిలో బిజీ [సంగీతం] అయిపోతాం.
(06:16) యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే అతను తను కొన్న వస్తువు కింద పడేసుకుంటే సైలెంట్ గా దాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు జరిగింది అది ఉంటుంది. కానీ మనం దొంగ అని ఫిక్స్ అయిపోతాము. ఒక సంవత్సరం తర్వాత అదే వ్యక్తి మనకు కనిపిస్తే వీడు దొంగ కదా అని చెప్పేసి మన మైండ్ మనకి అదే ఇమేజ్ ని చూపిస్తూ ఉంటుంది. అలా చూడటం వల్ల అతను ఏమవుతాడు ఎంత మంచోడైనా సరే మీ దృష్టిలో దొంగ అవుతాడు.
(06:38) సో నేను చెప్పవచ్చిన పాయింట్ ఇదే మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మన బ్రెయిన్ మనకి ఒక ఇమేజ్ ని చూపిస్తుంది. అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పేసి క్లారిటీ తీసుకోవాల్సింది మనమే. కానీ ఎప్పుడూ ఒకే ఇమేజ్ ని చూపిస్తూ ఒకే ఇమేజ్ లో ఒక మనిషిని ఫిక్స్ చేసి పెడితే ఆ మనిషితో మనం జీవితాంతో హ్యాపీగా ఉండలేము.
(06:59) ఎందుకంటే మనిషి వస్తువు కాదు కదా ఎప్పుడూ ఒకేలా ఉండటానికి మీరు ఎప్పుడైనా గమనించారా మనం గుడులకు కానీ గోపురాలకు కానీ ఎందుకు వెళ్తాం ఆశ్రమాల చుట్టూ ఎందుకు తిరుగుతాం ఇంట్లో భార్యతో గొడవ వస్తేనో ఆఫీస్ లో బాస్ తిడితేనో బిజినెస్ లో లాస్ వస్తేనో తట్టుకోలేక మైండ్ ని డైవర్ట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తాం. అక్కడ కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతత దొరికినట్లు నటిస్తాం.
(07:21) కానీ కార్ పార్కింగ్ దగ్గరకి రాగానే మళ్ళీ అదే టెన్షన్ అదే చిరాకు ఎందుకంటే మీరు మీ సమస్యల నుండి పారిపోవడానికి ఆధ్యాత్మికతను ఒక మందులాగా వాడుతున్నారు. మందు తాగేవాడు కిక్కు కోసం వైన్ షాప్ కి వెళ్తే మీరు కాస్త ఊరట కోసం గుడికి వెళ్తున్నారు. రెండిటికీ పెద్ద తేడా లేదు. ఎందుకంటే గుడికి స్వచ్ఛమైన మనసుతో వెళ్ళాలి. గుడికి వెళ్ళడానికి ఒక మెచూరిటీ కావాలి.
(07:45) అంతేకానీ దేవుడికి నా బాధలు మొత్తం చెప్పేసుకున్నాను నేను ఇక వెళ్ళిపోయిన తర్వాత దేవుడే చూసుకుంటాడు అంటే మాత్రం కుదరదు. జుడి కృష్ణమూర్తి గారు ఏమంటారంటే నువ్వు దేని నుండి అయితే పారిపోవాలని చూస్తున్నావో ఆ సమస్యే నువ్వు మీరు కోపాన్ని వదిలించుకోవాలి అనుకుంటారు కానీ కోపం మీకంటే వేరుగా ఉందా మీరే ఆ కోపం మీరు భయాన్ని పోగొట్టుకోవాలని చూస్తారు కానీ భయం ఎక్కడో బయట లేదు మీలోనే ఉంది.
(08:08) మిమ్మల్ని మీరే విడదీసుకొని ఒక మంచి ముక్కగా ఒక చెడ్డ ముక్కగా చూసుకుంటూ లోపల [సంగీతం] యుద్ధం చేస్తున్నారు. ఈ మానసిక విభజనే మీ అశాంతికి అసలు కారణం. సరే మరి నరకం నుంచి బయటపడటం ఎలా కృష్ణమూర్తి గారు ఎలాంటి షార్ట్ కట్లు చెప్పలేదు మంత్రాలు ఇవ్వలేదు తాయిత్తులు కట్టరు ఆయన చెప్పే ఏకైక మార్గం సాక్షి భావన చాలాసార్లు చెప్పాను నేను అంటే ఏంటో తెలుసా మీ లోపల ఏం జరుగుతుందో దాన్ని ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా కేవలం గమనించడం మీకు కోపం వచ్చింది అనుకుందాం వెంటనే నేను కోపపడకూడదు నేను ప్రశాంతంగా ఉండాలి అని మీ మైండ్ కి క్లాస్ పేకండి అలాగే ఆ కోపంలో
(08:44) ఎదుటి వాడిని తిట్టేయకండి. జస్ట్ ఆ కోపం మీ శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుందో గమనించండి. మీ గుండె వేగం పెరగటం, ముఖం వేడెక్కటం వీటన్నిటిని ఒక మూడో వ్యక్తిలా నిలబడి చూడండి. మీరు ఎప్పుడైతే ఆ కోపాన్ని జడ్జ్ చేయకుండా దాన్ని అణచి వేయకుండా కేవలం చూస్తారో, ఆశ్చర్యకరంగా ఆ కోపం కరిగిపోతుంది. దీన్నే కృష్ణమూర్తి గారు ది మెడిటేటర్ ఈస్ మెడిటేషన్ అన్నారు.
(09:10) ధ్యానం అంటే పొద్దున్నే పద్మాసనం వేసుకొని కూర్చోవడం కాదు. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆఫీస్ లో ఫైల్స్ చూస్తున్నప్పుడు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ప్రతి క్షణం మీ మనసు ఎటు పోతుందో గమనించడమే నిజమైన ధ్యానం. ఒక చిన్న పిల్లవాడు రోడ్డు పక్కన పడి ఉన్న రాయిని ఎంత ఆశ్చర్యంగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా చూస్తాడో ఈ ప్రపంచాన్ని అలా చూడటం అలవాటు చేసుకోవాలి.
(09:35) అప్పుడు చూసేవాడు చూడబడే వస్తువు రెండూ కలిసిపోతాయి. అక్కడ ఎలాంటి అహంకారం మిగలదు. కేవలం ఒక స్వచ్ఛమైన స్పృహ మాత్రమే మిగులుతుంది. మీరు ఒక విషయాన్ని ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా మనం ఎప్పుడూ ఒక రిఫరెన్స్ పాయింట్ పట్టుకొని బతుకుతాం. నా పాత అనుభవం ఇలా ఉంది. కాబట్టి ఈ కొత్త అనుభవం కూడా ఇలాగే ఉండాలి అనుకుంటాం. నిజానికి నిన్నటి రోజు చనిపోయింది.
(09:58) కానీ మీరు ఆ నిన్నటి శవాన్ని మోసుకుంటూ ఈరోజు అనే బ్రతుకు లోపలికి వస్తున్నారు. ఆ చనిపోయిన గతాన్ని వదిలేస్తే తప్ప కొత్త జీవితం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టదు. జీవితాన్ని మార్చుకోవడం అంటే ఏదో కొత్త అలవాట్లు నేర్చుకోవడం కాదు ఉన్న చెత్తని వదిలించుకోవడం. మొదటి స్టెప్ ఏంటంటే తీర్పులు ఇవ్వడం ఆపండి. రేపటి నుంచి మీరు ఎవరినైనా చూసినప్పుడు లేదా ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మీ మైండ్ ఇచ్చే పాత డెఫినేషన్లు పక్కన పడేయండి.
(10:26) ఆఫీస్ లో మీ కొలీగ్ మిమ్మల్ని చూసి నవ్వాడా వాడికి పొగరు అని చెప్పేసి వెంటనే డిసైడ్ అయిపోకండి వాడు జస్ట్ నవ్వాడు అంతే ఆ వెనుకున్న కథలు మీ అంతట మీరు ఊహించుకోవడం ఆపేయండి. రెండవ స్టెప్ నిజమైన ఒంటరితనాన్ని ఆస్వాదించండి. మనం ఒంటరిగా ఉండటానికి విపరీతంగా భయపడతాం. రూమ్లో ఐదు నిమిషాలు ఖాళీగా ఉంటే చాలు వెంటనే చేతులు జేబులోకి వెళ్లి ఫోన్ తీస్తాము.
(10:49) ఇస్గ రీల్స్ కాల్ చేయడం మొదలు పెడతాము ఎందుకు ఎందుకంటే మిమ్మల్ని మీరు ఫేస్ చేసుకునే ధైర్యం మీకు లేదు. కానీ మీరు అనుకుంటున్న ఒంటరితనం వేరు కృష్ణమూర్తి గారు చెప్పిన ఒంటరితనం వేరు. అది సమాజం నుండి పారిపోవడం కాదు మీ లోపల ఉన్న డిపెండెన్సీ నుండి విముక్తి పొందటం. ఎప్పుడైతే మీరు మీతో మీరు ప్రశాంతంగా కూర్చోగలరో అప్పుడే మీలో అసలైన క్లారిటీ మొదలవుతుంది.
(11:13) ఇక మూడవ స్టెప్ మీ [సంగీతం] బాధ్యతని మీరు తీసుకోండి. ఏ గురువు వస్తాడు నా జీవితాన్ని మారుస్తాడు ఏ పుస్తకమో చదివితే నా కష్టాలన్నీ తీరిపోతాయి అనే భ్రమల నుండి బయటపడండి. మిమ్మల్ని ఏ గురువు రక్షించలేడు ఎందుకంటే సమస్య మీ మనసులో ఉన్నప్పుడు దానికి తాళం చెవి బయట ఎక్కడో ఎందుకు తిరుగుతుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీ ఆలోచనలను మీరే స్కానింగ్ చేయడం నేర్చుకోండి.
(11:38) నిజం చెప్పమంటారా ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక రోబోలో మార్చాలని చూస్తుంది. మీరు కూడా దానికి లొంగిపోతున్నారు. కానీ ఒక క్షణం ఆగి ఆలోచించండి. మీరు చనిపోయే రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే మీ బ్యాంకు బ్యాలెన్స్ మీ ఇల్లు తప్ప మీకంటూ ఒక సొంత ఆలోచన మిగులుతుందా? లేదా సమాజం రాసిన స్క్రిప్ట్ ని చదువుతూ బతికేశానా అనే బాధ మిగులుతుందా? సాయంత్రం ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ రంగులను చూసి మైమర్చిపోయే హృదయం మీకు ఉందా? లేక అప్పుడు కూడా ఫోన్ లో ఫోటో తీసి స్టేటస్ పెట్టాలనే యంజైటీ లోనే బ్రతికేస్తున్నారా? ఆలోచించండి [సంగీతం] ఛాయిస్ మీదే గుర్తుపెట్టుకోండి గమనించే వాడే
(12:13) గమనించబడేది నువ్వే ఈ ప్రపంచం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అందులోనూ ఈ వీడియో పై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment