Friday, June 5, 2026

ఎందుకు ప్రస్తుత వైవాహిక జీవితం త్వరగా బోర్ కొడుతున్నది? Why Present Couples get Bored of each other?

ఎందుకు ప్రస్తుత వైవాహిక జీవితం త్వరగా బోర్ కొడుతున్నది? Why Present Couples get Bored of each other?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TysjEay-ssE



Transcript:
(00:01) మీరు గమనించారో లేదో నండి వ్యక్తిగౌరవాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయండి వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు 60 దాటింది పోనీ 70 దాటాయి భార్య భర్తలు ఉన్నారు బాధ్యతలన్నీ అయిపోయాయి పిల్లలకి పెళ్ళీళ్లు కూడా చేశారు. జీవితంలో బాగా అలసిపోయారు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎలా ఉంటుందంటే పెరిగే వయసు పెరిగే ఓపికలు కదా అటువంటప్పుడు భార్య భర్తను గాన భర్త భార్యను గాన ప్రశ్నించడం గాన తక్కువ చేసి మాట్లాడడం గాన అది మామూలే ఎందుకంటే అంత గొప్ప వైవాహిక జీవితాన్ని అది కూడాను సుదీర్ఘమైన వైవాహిక జీవితాన్ని గడిపారు కాబట్టి ఆ ఓపిక లేని పరిస్థితుల్లో ఏదో
(00:47) చిరుగుబుర్లాడుకోవడం మామూలుగానండి కానీ ఇప్పటి తరల్లో అంటే 30 35 వయసున్న ఆడపిల్లల్లో మోపిల్లల్లో సరే పెళ్లిఅయితే పురుషుల్లో స్త్రీలో అనుకోండి అసలు ఈ ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు అతి త్వరగా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి పాతపడిపోతున్నాడు మరి కొంత కాలం అయ్యేసరికి కొంచెం రోతగా చెప్పాలి అంటే రోత పడిపోతున్నాడు. వ్యక్తి గౌరవాలు తొందరగా ఆవిరయపోతున్నాయి.
(01:20) చెప్పాను కదా ఇక్కడ వయసుకు కూడా నువ్వు విలువ లేకుండా పోతున్నదండి వ్యక్తులు తొందరగా బూర కొట్టేస్తున్నారు ఒక తెలియని నిశశబ్దం రాజ్యం వెళ్తున్నది ఎవరనా ఏదనా అడిగినా కూడాను విసుగ్గా సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు పెళ్లి అలా అయిందో లేదో అతి తొందరగా అసంతృప్తి రాజ్యం వెళ్తున్నది అక్కడక్కడ ఈ అసంతృప్తి కూడాను పరాకాష్టకు చేరిన తర్వాత విడాకులకు దారి వేస్తున్నాడు అయితే ఇప్పటి తరంలో వ్యక్తులు పాతబడటం బోరు కొట్టటం ఎందుకు జరుగుతున్నది అసలు లోపాలు ఏంటి కారణాలు ఏంటి అంటే బిహేవియల్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయా
(02:06) ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్స్ ఏమనా ఉన్నాయా లేకపోతే అతి కోరికలు అట్లాగే కంపారిజన్స్ ఏమన్నా కారణమా అసలుఏం జరుగుతున్నది అన్నదే ఈ వీడియోలోని ప్రధాన అంశం అండి. ఇది చాలా డీప్ అండ్ కంటెంపరరీ ఇష్యూ అన్నమాట. ఎందుకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి త్వరగా బోరుకొడుతున్నాడు. అన్న ప్రశ్న కేవలం ఇప్పుడు వివాహాల్లోనే కాదండి స్నేహాలకి కుటుంబ బంధాలకి నా మాటకు వస్తే ఉద్యోగ సంబంధాలకు కూడాను వర్తిస్తున్నది.
(02:43) ఒక మాటలో చెప్పాలి అంటే ప్రస్తుత సమాజంలో సంబంధాలను బంధాలుగా చూడటం కంటే వాటిని వినియోగించే వస్తువులాగా చూడటం జరుగుతున్నదండి అంటే కన్స్ూమబుల్ థింగ్స్ గా చూడటం జరుగుతున్నది. కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అంటే మెటీరియలిజం వైపుకి ఇప్పటి యువత ఇప్పటి తరం ఎక్కువగా ముగ్గు చూపెడుతున్నది. గురించి మెటీరియల్ గురించి నేను కాస్త బాగా మాట్లాడుతాను అనుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త కల్చర్ వచ్చేసింది డొపమైన్ కల్చర్ అట అంటే పరిస్థితి తగ్గట్టు మనస్తత్వాలు తగ్గట్టు కుటుంబ వ్యవస్థకు తగ్గట్టు సామాజిక మార్పులకు తగ్గట్టు కొత్త కొత్త
(03:24) డెఫినిషన్స్ వస్తున్నాయి లేండి డొపమైన్ కల్చర్ అని చెప్పేసి అంటే మనిషి మెదడు ఎప్పుడూ కూడాను కొత్త ధనాన్ని ఇష్టపడుతూ ఉంటుంది కదా కానీ గతంలో కొత్తదనం తక్కువగా ఉండేది. ఇందాక మనం అనుకున్నట్టుగా బంధాలను దూరం చేసుకుంటే మనిషి కూడాను ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు సర్దుకుపోయే మనస్తత్వం ఉండేది భార్యా భర్తలోనే కాదు సమాజంలో వ్యక్తుల మధ్య కూడాను అప్పటి రోజుల్లో పెళ్ళళ్లకి పండగలకి ఒక సమిష్టి కార్యక్రమం ఉండేదండి అడగకుండానే వచ్చి సహాయం చేసిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు.
(03:59) కులాల పట్టింపులు కూడాను అంత పెద్దదిగా పెద్దవిగా ఉండేవి కాదు ఎందుకంటే నేనుటెన్త్ క్లాస్ ఎయిత్ నైన్త్ చదువుతున్నప్పుడు మా తాతగారి ఊరు వెళ్ళినప్పుడు వాతావరణం అలా ఉండేదన్నమాట అంటే అవసరాల్లో చరవ చూపడం వల్ల మానవ సంబంధాలు కూడాను పటిష్టంగా ఉండేవండి. ఎంత స్వతంత్రంగా ఉండేవాళ్ళు అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు ఈ వీడియో కొంచెం పెద్దగా వస్తుంది లేండి.
(04:20) మా నాయనమ్మగారు మా బాబాయి పెళ్లిలో ఏదో చేస్తున్నారు మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా కాలేదు ఏదో చేస్తున్నారు. చేస్తుంటే అందులో ఒక సాహిబు కట్టెల ముగ్గు తీసుకొచ్చి పడేసి ఆ తువాలని బెదిలించి అమ్మ వెళ్ళవస్తారా అన్నాడు. ఒరేయ్ అక్కడ వడల బిమ ఉన్నాయి చట్నీ ఉంది తినేసి అక్కడ కాఫీ కూడా ఉంది తాగేసి వెళ్ళురా అంటే ఇప్పుడు వద్దమ్మా నేను ఇందాకే తినేసాను ఆ తర్వాత చూద్దాంలేటంటే అరే అదేంటిరా అనగానే లేదులేమా ఇప్పుడు కడుపు నిండా ఉందిలే అని అన్నాడండి సరే మధ్యాహ్నం భోజనం రావాలిరా అంది సాయి ఎంత స్వతంత్రంగా అన్నాడంటే చూద్దాంలే అమ్మా చూద్దాంలే ఏముంది అన్నాడు బయటికి వెళ్ళాడు
(05:03) మా బంధువులందరితో కూడాను కుర్చి వేసుకొని కాసేపు కబురు చెప్పి వెళ్ళిపోయాడండి ఎంత స్వతంత్రం అండి అక్కడ అరమరికలు ఏమన్నా ఉన్నాయా కులాలు ప్రసక్తి ఏమన్నా ఉందా చెప్పండి. కానీ ఇప్పుడు ఏమైతున్నది అంటే ఈ సోషల్ మీడియా షార్ట్ వీడియోలు ఈ డేటింగ్ యాప్స్ అనేవి నిరంతర వినోదాన్ని ఇస్తున్నాయండి వీటి వల్ల మెదడు ప్రతిరోజు కొత్తదనం కోసం చని చూస్తున్నది.
(05:30) చివరికి కొత్తది అంటే ఆనందమే ఆనందం అన్న ఒక ఆటిట్యూడ్ వచ్చేసిందండి ఇప్పటి తరంలో అంటే ఇదే ప్రోగ్రామింగ్ గా ఫిక్స్ అయిపోయింది అన్నమాట నిరంతరం కొత్తదనం కొరకు అన్వేషణ తద్వారా తాత్కాలిక ఆనందం అసలు ఏదో సాధించాలన్న తప్పన తక్కువైపోయిందండి కాలయాపన విపరీతంగా జరిగి ఏమైతున్నది అంటే మెదడు అలసిపోతున్నది గంటలు తరబడి స్క్రీన్ టైం తీసుకోవడం అదేం పెద్ద క్రియేటివ్ టైం కాదు అది అలిసిపోవటం తర్వాత అసలు విషయాల మీద మనసు పోకపోవడం ఇప్పుడు జరుగుతున్నదండి అంటే ఎప్పుడైతే ఈ ఫోకస్డ్ అటెన్షన్ ఉండదో ఈ తాత్కాలిక ఆనందం అనేది ఒక వీక్నెస్ అయిపోతుందండి ప్రస్తుతం అదే జరుగుతున్నది
(06:15) చిన్న పిల్లల్లో అదే జరుగుతుంది పెళ్లైన వాళ్ళలో అదే జరుగుతుంది తల్లిదండ్రుల్లో అదే జరుగుతున్నది అన్నమాట ఈవెన్ తాతయ్యలు నాయనమ్మలు కూడాను ఈ స్క్రీన్ టైం లో పడిపోయారు సరే వాళ్ళు పడిపోయారు అంటే ఒక అర్థం ఉంది లేండి ఎందుకంటే వాళ్ళు ఒక జీవితాన్ని జీవించారు కాబట్టి అప్పుడు జీవిత భాగస్వామి కూడా కొత్తల్లో కొత్త వస్తువు అయిపోయి త్వరగా పాత బడలేదండి అది గమనించాలి.
(06:43) అది గమనించాలి దాదాపు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ వైవాహిక జీవితాన్ని ఆ రోజుల్లో చక్కగా అనుభవించారండి అసలు చిరాగులు పరాగులు లేవు కోట్లాటలు లేవు ఏదైనా ఉంటే అర్థం చేసుకొని సంసారాన్ని ముందుకు ఏడ్చట కానీ ఇప్పుడు జీవిత భాగస్వామి పెళ్లి అయిపోంగానే అతి తొందరలోనే ఒక కొత్త వస్తువు అయిపోయి తొందరగా పాతపడిపోతున్నదండోయ్ జాగ్రత్తగా గమనిస్తే నాకు అర్థమవుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా అంటే ఒక ఫిక్స్డ్ రొటీన్ కి అలవాటు పడటంలో ఉన్న ఆనందం నిజంగా చాలా గొప్పదండి అది వర్ణనాతీతం అంటే వేరే వైపు మనసు పోనివ్వదు అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫోకస్డ్ అటెన్షన్
(07:20) ఏర్పడుతుంది. భార్యా భర్తలు సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో నిరంతరం బిజీగా అయిపోతూ ఉంటారు ఎందుకంటే కొద్ది కొత్త లక్షాలు పెట్టుకుంటూ ఉంటారు. కదా పిల్లల మీద లేకపోతే భవిష్యత్తులో ఒక ఇల్లు కొనటం మీదనో లేకపోతే దేని మీదనో పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా జరగట్లేదండి అలా జరగట్లేదు లక్షహీన జీవితమే కొత్తదనాన్ని కోరుకుంటుంది.
(07:44) అంటే క్షణ క్షణానికి వాళ్ళు కొత్తదనం కావాలి ప్రమాదం ఎక్కడఉందంటేనండి కొన్ని నెలల తర్వాత ఈ కొత్తదనం తగ్గగానే ఇతను మారిపోయాడు లేకపోతే ఆమె మారిపోయింది అన్న భావన వచ్చేస్తున్నదండి నిజానికి మనం ఒకటి గమనించాలి ఇక్కడ మనిషి మారలేదు ఈ మెదడు కొత్తదనం కోసం ఆకలితో అలమటిస్తుంది. సో వ్యక్తిని కాకుండా అనుభూతిని మాత్రమే ప్రేమించడం జరుగుతున్నదండి.
(08:15) అసలు ఇప్పుడున్న యువతల ప్రేమ యువత ప్రేమలో పడేది వ్యక్తితో కాదండి. ఆ వ్యక్తి వల్ల కలిగే ఎమోషన్స్ తో ప్రేమలు కొడుతున్నది అన్నమాట. అసలు శిసలైన ప్రేమకి ఎమోషన్స్ కి సంబంధం లేదండి ఎక్వానిటీ ఉంటుంది. అర్థం చేసుకునే ఒక ప్రయత్నం ఉంటుందన్నమాట. అసలు శిశులైన ప్రేమలో ఇప్పుడు ఒక ఉదాహరణ నన్ను ప్రత్యేకంగా చూసుకున్నాడు లేకపోతే నన్ను ఆమె అర్థం చేసుకున్నది లేకపోతే నాతో ఎక్కువగా మాట్లాడింది అని అనుకుంటున్నప్పుడు ఏమైతుందంటే ఈ అనుభూతి మొదట్లో చాలా అద్భుతంగా ఉంటుందండి కానీ ఇలా ఎంతకాలం ఉంటుంది
(09:01) పెళ్లియన తర్వాత జనరల్ గా జరిగే ఒక సైకలాజికల్ ల విషయం ఏంటంటే నండి ఈ వస్తువు నా సొంతం అయిపోయింది. మీ భార్య భర్తని అనుకుంటుంది భర్త భార్య అనుకుంటాను అనుకుంటాడు అన్నమాట ఈ వస్తువు నా సొంతం అయిపోయింది. ఏ మార్పు ఉండటం లేదు కొత్తదనం కనపడటం లేదు అన్న భావనతో సాధారణ జీవితం మెల్లమెల్లగా మొదలైతూ ఉంటుందండి.
(09:29) అప్పుడు వీళ్ళద్దరు ఏమనుకుంటారంటే నేను ముందు అనుభవించిన ఫీలింగ్ లేదు అని పదేవే పదే అనుకుంటూ ఉంటారండి అసలు ఎందుకు ఉంటాయండి ఆ ఫీలింగ్స్ పెళ్లికి ముందు ప్రేమించుకునేటప్పుడు ఉన్న ఫీలింగ్స్ పెళ్లి తర్వాత ఉంటాయా ఉండవు కాక ఉండవు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడున్న యువత ఎందుకు ఉండవు అంటే పెళ్లి తర్వాత ఎమోషన్స్ స్థానంలో బాధ్యతలు ఎక్కువగా చోడ్ చేసుకుంటాయండి.
(09:54) ముఖ్యంగా లవ్ మ్యారేజెస్ లో ఎట్లా ఉంటుందంటే బాధ్యతలు విస్మరించి పెళ్లికి ముందు వాతావరణాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి ఇంకా తొందరగా పాతపడిపోతూ ఉంటుంది వ్యక్తి గౌరవాలు ఉండవు అక్కడ ఎందుకంటే ఎవరికి వాళ్ళు అవతలి వాళ్ళు నావాళ్లే నా సొంతమే అని అనుకుంటూ ఉంటారండి బాధ్యతల మధ్య ఉండటం వల్ల నిరంతరం కొత్తదనం ఉండదండి ఆ కొత్త ధనాన్ని మనం మెలగ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అంతే నేను మొన్న ఒక వీడియోలో ఒక ఉదాహరణ కూడా చెప్పాను అది ఏంటంటే ఓ నచ్చిన మంచి కవర్ కొన్నారు కొత్తల్లో కొద్ది రోజులుగా బాగా తుడుస్తారు.
(10:35) తర్వాత తర్వాత ఏమైతుందంటే ఇది నా కారే కదా ఎక్కడికి పోతుంది నా చెప్పు చేతల్లోనే ఉంది కదా కాబట్టి ఎప్పుడైనా తుడవచ్చు అని అనుకుంటారు. తర్వాత ఎప్పుడనా బయటకి తీసినప్పుడు శుభ్రంగా తుడుచుకొని ఆ కారుని నిగనిగలాడేటట్టు చేసి బయటకి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ కారు అదే కానీ తగ్గింది ఏమిటి శ్రద్ధ వ్యక్తుల మధ్య కూడా ఇదే జరుగుతున్నదండి దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ యస్ మెటీరియలిజం భౌతికవాదం ఒక్కటండి వస్తువులు ఎప్పుడూ అలాగే ఉండవు యూసేజ్ వల్ల వేరంటే టేర్ కి గురైతూ ఉంటాయి.
(11:14) ఆ వస్తువుల యొక్క పనితనం కూడాను తగ్గుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అదే జరుగుతున్నది. వ్యక్తి ప్రాముఖ్యత లేదు వస్తు ప్రాముఖ్యతే ఉంది. ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఇంకో ముఖ్యమైన విషయం ఏందటంటే సినిమాలు సీరియల్స్ సోషల్ మీడియా ఈ ఎక్కువ భాగం విషాన్ని చింపుతున్నాయండి ఇవన్నీ కూడా వ్యక్తి బలహీనలతో కూడా నాడుకుంటున్నాయి వ్యక్తి గౌరవాలను మంట కలుపుతున్నాయండి దీనివల్ల జరిగిన ప్రమాదం ఏంటో తెలుసా ఇంకా రాబోయే తరాలు కూడా జరుగుతుందండి అదేంటంటే ఏ వయసులో ఏది తెలవకూడదో అవే తెలిసిపోతున్నాయండి.
(11:54) భార్యా భర్తల మధ్య పనికిరాని దోకులు వేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు తక్కువగా మాట్లాడుకుంటూ వస్తున్న వీడియోలు పిల్లల మీద ఒక విష ప్రభావాన్ని చూపెడతాయి అన్న వాస్తవాన్ని ఈ సోషల్ మీడియా గాని సీరియల్స్ గాని సినిమాలు గాని పట్టించుకోవట్లేదండి వాళ్ళకి కావల్సింది డబ్బు అంతే కానీ వాస్తవం ఏంటంటే జీవితకాలంలో ఏ మనిషి ఇంకో మనిషిని నూటికిన శాత అర్థం చేసుకోలేదటండి.
(12:22) ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడాను కొంత వ్యక్తిగతం ఉంటుంది. పరిమితులు ఉంటాయి ఒక పనిలో నిమగ్నమై పని చేసినప్పుడు అతనికి కూడాను అలసటం ఉంటుంది. విశ్రాంతిని కోరుకుంటూ ఉంటాడు. లోపాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి. పైపెచ్చు అంచనాలు కూడా ఉంటాయండి కాబట్టి ఏ వ్యక్తి కూడాను ఇంకో వ్యక్తిలాగా 100% మ్యాచ్ కాడండి. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే బాధ్యతలు తక్కువ అంచనాలు మడుగు ఆకాశంలో ఉంటున్నాయి.
(12:56) అందుకనే నిరాశ కూడాను అంత పెద్దదిగా ఉంటున్నదండి మీరు ఒకటి గమనించారో లేదో పాత రోజుల్లో వస్తువు పాడైపోతే రిపేర్ చేసేవారు కదా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్త వస్తువు కొనేస్తున్నారు అంతే అంటే సంబంధం గనుక సరిగా లేకపోతే దెబ్బ తింటే సరి చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు ఏమైతున్నది అంటే ఈ వ్యక్తితో నేను ఇంతకాలం ఇంకా గడపాలా ఇంకా ముందు ముందు కూడా అన్న ప్రశ్న వేసుకుంటున్నారండి మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఏంటి వస్తువుల మీద ఏవైతే అభిప్రాయం ఉందో ఇదే ఆటిట్యూడ్ వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ప్రవేశించింది అన్నమాట
(13:43) దీన్నే రీప్లేస్మెంట్ కల్చర్ అంటారు. ఈ రీప్లేస్మెంట్ కల్చరు మానవ సంబంధాల మీద కూడాను విపరీతమైన ప్రభావాన్ని చూపెడుతున్నదండి. ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తి కేవలం ఒక అవసరంగానే పరిగణించబడుతున్నాడు. అసలు శిసలైన వివాహం అంటేనండి సప్తపతి ప్రాతిపదికగా నేను నీతో ఉండటమే ఆనందం అన్న భావన ఇద్దరిలో ఉండాలి. సమస్య వస్తే చర్చించుకొని సాల్వ్ చేసుకుందాం అన్న విజ్ఞత ఉండాలి ఇద్దరిలో కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే నువ్వు నా అవసరాలు తీర్చాలి అంతే ప్రేమించుకున్నాము భర్తగా నా జీవితంలోకి
(14:30) వచ్చేసావు నా డబ్బు మీద ఆశ పెడతావ ఏంటి నా డబ్బు నాదే నువ్వు నన్ను సుఖపెట్టాలి అన్ని సౌకర్యాలు ఏర్పరచాలి అన్న ధోరణి కూడాను అక్కడక్కడ ప్రబలువుతున్నదండోయ్ అంటే ఏంటి నువ్వు మన అవసరాలు తీర్చాలి అంతే అన్న జాడ్్యానికి చేరుకుంది అసలు వివాహ వ్యవస్థ అంటే ఇక్కడ ఏంటంటే డిమాండ్ ఉంది తప్ప సప్లై లేదు సప్లిమెంట్ లేదు చివరికి కాంప్లిమెంట్ అసలే లేదండి ఇక వ్యక్తి గౌరవం ఎలా ఉంటుంది చెప్పండి ఇంకొక సైకలాజికల్ ఇష్యూ ఏంటంటే వీళ్ళు కష్టపడి చదివారు నిజమే దాని తర్వాత పోటీ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యి పోటీ పరీక్షలు రాశారు
(15:16) నిజమే దాని తర్వాత కొంతమందికి క్యాంపస్ సెలెక్షన్స్ లో మరి కొంతమందికి పోటీ పరీక్షలు రాసిన తర్వాత ఉద్యోగం వచ్చింది నిజమే ఈ లోపలే ఈ ప్రేమ అనేది మహావృక్షంగా మరి మారి పెళ్ళలు చేసేసుకుంటున్నారు అంటే వీళ్ళకి అసలు జీవితం అంటే ఏమిటో తెలియదు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అది పెద్ద ఘనకార్యంగా భావించేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము ఒకళ్ళకఒకళ్ళం పూర్తిగా తెలుసుకున్నాం అని అనుకుంటున్నారండి నిజంగా చెప్పాలి అంటే ఇదిఒక మిత్ అండి ఒక బ్రమ అంతే జీవితం ముగిసిపోతున్న తరుణంలో కూడాను ఒక్కళ్ళకి ఒకళ్ళు అర్థం కాండోయి అంతే కర్మ సిద్ధాంతం ప్రాతిపదికగా ఇదే
(15:51) జరుగుతుంది దాన్ని నమ్మాలి ఇప్పుడు నేను మళ్ళీ కర్మ సిద్ధాంతం అన్నాను అనుకోండి అది కొత్త టాపిక్ అయి కూర్చుంటుంది. సో మేము ఒకళళనొకళని పూర్తిగా అర్థం చేసుకున్నామ అన్నది ఒక మిత్ అంతే ఎప్పుడైతే అలా అనుకుంటారో కృతజ్ఞత తగ్గిపోతుంది అర్థం చేసుకోవడం తగ్గిపోతుంది వినడం తగ్గిపోతుంది వినిపించుకోవడం తగ్గిపోతుంది చివరికి ఏమవుతుంది వ్యక్తి విలువలు తగ్గిపోతాయండి.
(16:15) ఇప్పుడు సరిగా అదే జరుగుతుందండి. అంటే దగ్గర ఉన్నదాని విలువ తగ్గిపోవడం అన్నది సహజమైన మానసిక ధోరణ అండి దీన్నే సైకాలజీలో ఏమంటారంటే హెడోనిక్ అడాప్షన్ అంటారు హెడోనిక్ అడాప్షన్ అంటారు. మన దగ్గర ఉందనుకోండి దాని విలువ మనకు తెలియదు అందుకనే అంటుంటారు కదా దూరపు ఉండాలి మనకు అని దగ్గరికి వెళ్తే గాని తెలియదు. చివరిగా ఒక మాట అండి జన్మ తీసుకున్న ఏ వ్యక్తి ఏ జీవి కూడాను పరిపూర్ణత సాధించదు లేకపోతే సాధించడు అసలు జన్మ తీసుకున్నామ అంటే కర్మను అనుభవించడానికి వచ్చాం నిజంగా పరిపూర్ణత గనుక సాధిస్తే ఆధ్యాత్మికలో మళ్ళీ జన్మ
(17:01) ఉండదండి అయితే మనందరం చేసేది ఏంటంటే పరిపూర్ణత వైపుకి ప్రయాణం చేస్తున్నాం అంతే చివరికి మఠాధిపతి జీవితం కూడా అంతేనండి ఒక్క మాట అండి అంతర్గత పరిపక్వత లేని వ్యక్తి ఎవరితో ఉన్నా ఎంతకాలం ఉన్నా కొంతకాలం తర్వాత అసంతృప్తిగానే ఉంటాడు. కాబట్టి చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే పెళ్లి చేసుకునేవాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడాను ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.
(17:36) ధైర్యం లేకపోతే కొంత సమయం తీసుకోండి లేదండి మేము ఒకళళ బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాం మా వైభవా జీవితం అద్భుతంగా ఉంటుంది అని గనక మీరు నిజమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తే అవిగా పెళ్లి చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎన్నో విషయాలని స్పృషించే ప్రయత్నం చేశనండి ఇక్కడ సైకలాజికల్ గా కూడాను కొన్ని విషయాలను నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.
(18:00) కాబట్టి పెళ్లైన వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే తల్లిదండ్రులుగా మారిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న యువత కూడాను ఈ వీడియోని ఒకటి రెండు సార్లు చూడండి. వాస్తవాలు బోధపడతాయి. తొందర పడొద్దు ఇంకొంత కాలం ఆగుదాం అని అనుకుంటారేమో కొంతమంది ఈ వీడియోని చూసిన తర్వాత అందుకే వీడియో చేస్తున్నానండి ఎవరు ఎవరికి పాత పడిపోకూడదండి పాత పడిపోయిన తర్వాత ఏముందండి జీవితం కదా సో ఇదండి వీడియోలోని సంగతి వినంద కృతజ్ఞతలు వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి.
(18:31) నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ ఇంటి పేరు పోరూరి ఎంఏఆర్ టి హచ్ ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కే ఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓ ఆర్ యు యు ఆర్ ఐ నా పేరు వచ్చేస్తుందండి YouTube లో అది నా YouTube ఛానల్ ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089 ఎవరనా మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడు మాట్లాడొచ్చు నాతో ఇబ్బంది ఏమ లేదు ఎందుకంటే చాలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి అనుకోండి ఇకపోతే చివరిగా ఒకరి రిక్వెస్ట్ అండి.
(19:03) బెల్ ఐకాన్ అంటారా లైక్ బటన్ అంటారా మీ ఇష్టం అండి. కానీ కామెంట్ బాక్స్ లో మటుకు ఈ వీడియో మీద మంచి అభిప్రాయాన్ని లేకపోతే మీ ఇష్టమైన అభిప్రాయాన్ని ఇష్టంవచ్చిన అభిప్రాయాన్ని తెలియపరచండి దాని నుంచి నేను నేర్చుకుంటాను ఇంకా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది నాకు ఇదండ నమస్కారం

No comments:

Post a Comment