Sunday, October 11, 2020

మానవుని విధులు

🟢 పితామహ పత్రీజీ 11-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 11-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"మానవుని విధులు"

" మానవుడు ప్రకృతి పట్ల, తన శ్వాస- రూపం పట్ల, తన త్రితత్వ- నేను పట్ల, ఎక్కడనుంచి అయితే త్రితత్వ- నేనుకు కాంతి వస్తుందో ఆ మేధస్సు పట్ల మరియు మహోన్నతమైన ప్రజ్ఞ పట్ల తన విధులను నిర్వహించవలసి ఉంటుంది."

"ప్రకృతి పట్ల తన విధి అంటే తన శరీరంలోని ప్రకృతి పట్ల మరియు బాహ్యంగా ఉన్న ప్రకృతి పట్ల మానవుడు తన విధులను నిర్వహించవలసి ఉంటుంది."

" ప్రకృతి పదార్థం మానవ శరీరం లోపల ఉన్నందున శరీర- నేను దానిని మరింతగా మెరుగుపరుచుకోవలసి ఉంటుంది, తద్వార అది ఉన్నత ప్రమాణంలో ఎరుకలోనికి రాగలుగుతుంది. నాలుగు సజీవ ఇంద్రియాల యొక్క బాగోగులు చూసుకోవటం తన విధిలో చేర్చుకోవలసి ఉంది."

"బాహ్య ప్రకృతి పట్ల మనిషి విధి ఏమిటంటే తను ఏ మతంలో జన్మించాడో లేక తాను ఎన్నుకున్న మతానికి అనుగుణంగా ఆరాధన చేయటం మరియు దాని పట్ల విశ్వాసం కలిగి ఉండటం."

"మనిషి ఎప్పుడయితే తన మూల ప్రకృతి లేక ప్రకృతి దేవతల నుంచి రాలేదని కనుగొంటాడో అప్పుడు తన శ్వాస- రూపం పట్ల తన విధి మొదలవుతుంది. ఇప్పుడు, తన కర్తవ్యం ఏమిటంటే శ్వాస- రూపాన్ని శాశ్వత పరిధిలో పునరుద్ధరించుకుని తద్వారా శాశ్వత పరిణామక్రమంలో చోటు సంపాదించుకుని, త్రితత్వ- నేను ప్రజ్ఞగా మార్పు చెందుతుంది."

"త్రితత్వ- నేను పట్ల శరీర-నేను యొక్క కర్తవ్యం ఏమిటంటే త్రితత్వంలోని మూడు భాగాలు శరీరం (doer), మనసు (thinker) మరియు ఆత్మ (knower); మరియు వీటి నడుమ గల సరి అయిన సంబంధం ఏమిటి అని తెలుసుకోవటం, ఇంకా ప్రకృతి యొక్క మాయలో తనను తాను కోల్పోకుండా ఉండగలగటం."

" శరీర- నేను తన ప్రకృతిని మరియు కార్యాచరణ విధులను భావన మరియు కోరికగా తెలుసుకోవాలి; ఆలోచన చేసేవాడిగా తనను తాను న్యాయం మరియు తర్కంగా మరియు ఆత్మదిశగా సాక్షి (I - ness) గా మరియు నేను (Selfness) గా గుర్తింపు కలిగి ఉండటంగా తెలుసుకోవాలి."

" శరీర- నేను కు, శరీరం, జ్ఞానం పట్ల ఉన్న కర్తవ్యం ఏమిటంటే తన త్రితత్వ- నేను లో ఉన్న చైతన్యపు కాంతిని గుర్తించటమే."

"మానవుని కర్తవ్యం ఏమిటంటే కాంతి యొక్క మేధస్సు ద్వారా తనలో వున్న మహోన్నత ప్రజ్ఞ పట్ల ఎరుక కలిగి ఉండటం."

"ఎప్పుడయితే ఈ విధులన్నింటినీ సమగ్రంగా అవగాహన చేసుకోగలుగుతారో, తినటం, త్రాగటం, స్నానమాచరించటం, శ్వాసించటం, నిద్రించటం లాంటి శారీరక విధులు మరియు తనకు ప్రియమైన వారితో సంభాషించినంత ఆనందంగా మరియు స్పష్టతతో ఈ విధులను నిర్వహించగలుగుతారు."

💖 ఎస్ పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment