Sunday, October 11, 2020

నిజమైన గొప్పతనం ఎక్కడవున్నది ???

నిజమైన గొప్పతనం ఎక్కడవున్నది ???

🍁🍁🍁🍁



నిజమైన గొప్పతనం గొప్పవారమని భావించేసుకోవడంలో ఉందా.. ఇతరులలో గొప్పతనాన్ని గుర్తించడంలో ఉందా.. ఇతరులను తక్వచేయడం ద్వారా వచ్చే గొప్పతనంలో గొప్పతనం ఎక్కడ.. ఆలోచిస్తే గొప్పతనమన్నది మనోజనిత మిథ్యాపరికల్పన అని అర్థమౌతుంది.

శరీర కదలికలో గర్వం ప్రతిక్షణం తొంగిచూస్తూ ఉంటుంది. పరస్పర గౌరవం అనే విలువను జీర్ణం చేసుకొనేవరకు మానవ సమాజం అన్ని స్తరాలలోను ఈ గొప్పతనమనే దోషం నుండి బయటపడటం దుస్సాధ్యమే.

నిజమైన గొప్పతనం ఆస్తిలో లేదు, అంతస్థులో లేదు, హోదాలో లేదు.. మరెక్కడుంది..

సృష్టిలో ప్రతి అణువులో, ప్రతి అంశంలో దాగిన గొప్పతనం గుర్తించడంలో ఉంది. అహంభావాన్ని అదుపులో ఉంచుకోవడంలో ఉంది. అంతే కాదు.. ప్రతివారు ఎవరికి వారే వారి వారి ఎవరి స్థానాలలో గొప్పవారని తెలుసుకోవడంలో ఉంది. ఎవరు తాము గొప్పవారమని భావిస్తారో వారు నిజానికి గొప్పవారు కానే కాదు..

నిజమైన గొప్పవారికి తాము గొప్పవారమనే ఆలోచన కూడా ఉండదు. అందుకే గొప్పతనమన్నది ఒక మిథ్యాభావం. నిజమైన గొప్పతనం ఇతరులను కించపరచదు. నిజమైన గొప్పతనం భేదాలను సృష్టించదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేది. దర్శింపజేసేదే నిజమైన గొప్పతనం.

భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అంటే.. సృష్టి అంతా వ్యాపించిన దివ్యత్వాన్ని దర్శించడమే...


🍁🍁🍁🍁

Source - Whatsapp Message

No comments:

Post a Comment