మనసు - బుద్ది.. మన జీవితంలో 🌸
🌸 మనసు బుద్ది పరస్పర విరుద్దాలైన మంచి స్నేహితులు... ఒకరినొకరు ఒప్పుకోవు... ఏ పనినైనా ఒక్కరే చేయవు.. వీటికి భౌతికంగా విలువ ఎక్కువ... వీటితో మమేకమై జీవించేవారు ఎక్కువ కమన్ సెన్సు
తో ఉంటారు... వీరి మాటలు ఎంతో బాగా ఉంటూ , 'అవును' కదా అనిపించేటట్లు ఉంటాయి.. సాధారణంగా వీరు మొటివేటర్స్ గా వుంటారు...
కారణం వీరికి మాటలతో కనిపించని మనసు బుద్ది... లను నిద్రలేపే మాటలు చెబుతూ ఉంటారు... భౌతికంగా... ఒక్కమాటలో మనసు బుద్దిలను రగిలించేస్తారు... కారణం నేను ను వారు గుర్తించినట్లు సామాన్యుడు గుర్తించలేకపోవడమే...
🌸 మనిషిలో ఉన్న శక్తిని నిద్రలేపటం ఒక పద్ధతి... అందరిలో ఆ శక్తి ఉంటుంది... మనకు సహజంగా అత్యవసర సమయాలలో బయటకు వస్తుంది... ఆడవారికి పొయ్యి మీద పాలు పొంగిపోతు ఉంటే ఏ పట్టకర్ర పాతగుడ్డ లేకుండా ఉత్త చేతులతోనే దింపేస్తారు...
మొగవారైతే ఇంటిపని లేదా పొలం పనిలో వర్షం వస్తుంది అని అనిపిస్తే పని వదిలేయకుండా రెట్టింపు వేగంతో చేస్తూ ఉంటారు అవసరమైనప్పుడు మాత్రమే ఆవేగంతో పనిచేస్తారు.. అంటే ప్రతి ఒక్కరిలో అంతర్గత శక్తి ఉంది అనేది నిర్వివాదాంశం...
🌸 మనసు బుద్ది రెండు కూడా మొదట తల్లిదండ్రులు వలన, తర్వాత బళ్ళో టీచర్స్ వలన... తర్వాత వెనుక బెంచిలలో కూర్చునే స్నేహితుల వలన ప్రభావితం అవుతాయి...
తల్లిదండ్రులు వలన ప్రభావితం అయితే ఆధ్యాత్మిక0లోకి రావడం కొంచం ఆలస్యం అవుతుంది వీరికి బాధ్యతల పేరుతో అవి అడ్డు పడతాయి... టీచర్స్ వల్ల ప్రభావితం అయితే వీరు ఎక్కువగా emploies అవుతారు కానీ కోరికలు బలంగా ఉంటే మాత్రం వీరిలో బుద్ధివికాశం వల్ల త్వరగా తమని తాము మార్చుకుంటారు. వీరు ధ్యానసాధనకన్న ఎదుగుదలకు పెద్దపీట వేయటం వల్ల మనసు బుద్ది లకు వశమౌతారు.. బాక్ బెంచర్స్ వల్ల ప్రభావితం అయితే స్వయం ఎదుగుదల వైపు నడుస్తారు.. వీరు త్వరగా ఆధ్యాత్మిక దారిలో నడుస్తారు కూడా... అంటే మన మనసు బుద్ది మొదటినుంచి వికశింప చేసే ఆలోచన లేదా మాట లేదా సంఘటనల వల్ల ప్రభావితం చేయబడింది... కానీ ఎప్పుడైతే అనుభవ జ్ఞానం మనిషికి తోడౌతుందో అక్కడ నుండి మార్పు మొదలు... ఇదంతా బయట ప్రపంచ0...
🌸 మనం అంతర ప్రపంచంలోకి అడుగు పెట్టేటప్పటికి మనసు బుద్ధికి సఖ్యత కుదరనప్పుడు మాత్రమే ఆ వైపు వస్తాం... సహజంగా చాలా కొద్ది మంది మాత్రం చిన్నప్పుడు ధ్యాన పరిచయం అయినవారు వేరే గా ఉంటారు వేరేగా ఆలోచిస్తారు... సహజ జీవితంలో మాత్రం ఎక్కువ మంది ఆధ్యాత్మికంగా సంఘటనల ప్రభావం తోనే వస్తారు... ధ్యానసాధన మొదలు పెట్టాలి అంటే అక్కడ మన మనసు బుద్ది లను ఓ క్రమంలోకి తెచ్చుకోవలసిందే.. ఎందుకంటే అవి పనిచేసినంత కాలం ధ్యాన సాధన ఓ తంతు అవుతుంది... ఎప్పుడైతే ధ్యానసాధన లో నిమగ్నమౌతారో మనసు బుద్ది లకు విశ్రాంతి చేకూరి సవ్యంగా పనిచేయటం మొదలౌతుంది...
మన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో మనసు బుద్దిలకూ కూడా అవసరం... ఎప్పుడైతే సవ్యంగా, స్థిరంగా ఉంటాయో అక్కడ నుంచి కొత్త జీవితం మొదలు...
మరో పోస్టులో ఆధ్యాత్మిక0లో మనసు బుద్ది చేసే విన్యాసాలు చూద్దాం..*
Thank you...🌸🌸🌸
Source - Whatsapp Message

No comments:
Post a Comment