Friday, October 2, 2020

నేటి మంచిమాట

🙏నేటి మంచిమాట🙏

రావణుడుతో ఉన్న విభీషణుడు చెడిపోయాడా?
రాముడుతో ఉన్న కైకేయి బాగుపడిందా?
మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు ఎలా ఉన్నామన్నదే ముఖ్యం..!
యుద్ధం వస్తే కాని,
అంగ బలం బయట పడదు...
ఆత్మాభిమానం భంగ పడితే కాని,
బుద్ధి బలం బయట పడదు...
జీవితంలో నిలబడాలంటే శరీర బలం కాదు,
మానసిక బలం చాలా అవసరం.!

జీవితం గొప్పగా ఉండాలని ఆలోచిస్తారు కానీ,
జీవితం కన్నా వ్యక్తిత్వం గొప్పగా ఉండాలని ఆలోచించరు...✓
వ్యక్తిత్వం గొప్పగా ఉంటే,
జీవితం గొప్పగా ఉంటుంది..
మానసికంగా ఎదగలేనప్పుడు,
శారీరకంగా ఎంత ఎదిగితే మాత్రం ఏం ప్రయోజనం?
అడివిలో దున్నలా మంచి చెడు ఆలోచించే కనీస విచక్షణ జ్ఞానం కూడ ఉండదు...!
తిట్టేవాడికి దగ్గరగ ఉన్నా ఫరవాలేదు గాని,
పొగిడే వాడికి మాత్రం దూరంగా ఉండండి..

🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment