Friday, October 2, 2020

మంచి మాటలు

ఆదివారం --: 23-08-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ..

తల్లిదండ్రుల ప్రేమించు
తోబుట్టువులు ఆదరించు
తోటివారిని గౌరవించు
గురువును పూజించు
దైవాన్ని ప్రార్థించి
సర్వం నీకు విజయం

అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చేయి అందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు నీ బాధ్యతలను ఎప్పుడూ గుర్తుకు చేసుకుంటూ ఉండు , నీ విలువైన సమయాన్ని సద్వనియోగం చేసుకుంటూ విజయం వైపు ప్రయానించు . ఏమి చేయక తినుకుంటూ ఇంట్లో కూర్చుంటే కొండలు సైతం కరిగిపోతాయి పోతే తిరిగి రానిది వయసు ఒకటే గుర్తుపెట్టుకో

మనకు కొపం వచ్చినా మనల్ని బాధ పెట్టినా మననుండి అలిగి వెళ్లిపోయినా పొరబాటున మనల్ని ఒకమాట అని పో అని పది అడుగులు వేసేసినా పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకునే అమ్మతనం స్నేహం మాత్రమే .

నమ్మకం అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది , ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది , అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది . కానీ ! నిరూపించుకోవడానికి జీవిత కాలం పడుతుంది .

సేకరణ 🖋️*మీ ... AVB సుబ్బారావు 🌹💐🤝🕉️

Source - Whatsapp Message

No comments:

Post a Comment