Friday, October 2, 2020

మంచి మాటలు

శనివారం --: 22-08-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు..

ముందుగా మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

తల్లిదండ్రులు ప్రేమించు
తోబుట్టువులును ఆదరించు
తోటివారిని గౌరవించు
గురువును పూజించు
దైవాన్ని ప్రార్ధించు
సర్వం నీకు విజయమే

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్ప తనం ఉంటుంది . మనకు దాన్ని చూసే గుణం అభిమానించే మంచి మనసు ఉండాలి . గడచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్లీ తిరిగి రాదు కాబట్టి , రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్లు ఊహించుకుంటాము కాబట్టి , ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి .

అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు , అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు , అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు .

మనకు బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం కొగిలించుకోలేము మన భుజాల మీద పడి మనం ఏడవలేం అందుకే ఏలాంటి పరిస్థితులో అయినా మనకంటూ మన అనే వారు ఉండాలి అందుకే మనల్ని ఇష్టపడే వారిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు మిత్రమా ! ...

సేకరణ 🖋️*మీ ...AVB సుబ్బారావు 💐🌹🕉️🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment