Friday, October 9, 2020

సాత్వికతను అలవరచుకుందాం...

సాత్వికతను అలవరచుకుందాం...

నిజానికి ఒక వ్యక్తి విలువలను పొందాలంటే ఆ మనిషికి ఉండవలసినవి ధనం కాదు గుణం. గుణవంతుడు ఎప్పుడూ కూడా తన గురించి కాకుండా, తన తోటివారి బాగోగుల గురించి, సమాజానికి జరగవలసిన మంచి గురించి ఆలోచిస్తాడు. అటువంటి వాడు తాను గుణవంతుడుగా ఉండడమే కాకుండా తన తోటివారిని కూడా గుణవంతులుగా తయారు చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిజానికి అటువంటి వాడికి ధనం లేకపోయినా మంచి గుణమున్న వ్యక్తిగా అతడికి ఈ సమాజం విలువ నిస్తుంది.

ఈ గుణాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి తమోగుణం, రెండు రజోగుణం, మూడు సత్వగుణం.

వివరాల్లోకి వెళ్తే....

తమోగుణం ఉన్నవాడు సోమరితనం, బద్దకం, పిరికితనం, పిసినారితనం, ఆత్మన్యూనత భావన, అంతర్మదనం, ఊగిసలాట, అతినిద్ర, అతి తిండి, చెప్పిన మాట వినకపోవడం, దేనిగురించి పట్టించుకోక పోవడం వంటి లక్షణాలతో 'తనని తాను చంపుకొంటూ' జీవిస్తాడు. ఇలాంటి వారిని సెల్ఫ్ కిల్లర్ అంటారు.

రజోగుణం ఉన్న వాడిలో కోపం, ఆవేశం, ద్వేషం, చిరాకు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్చ్యర్యం, అబద్ధపు జీవితం, ఇతరులను హింసించడం, మాటలతో బాధపెట్టడం, ఘర్షణ భావం, ఇతరులను మోసగించడం వంటి లక్షణాలను కలిగి ఉండి 'తనని తాను చంపుకొంటూ జీవించడమే కాదు ఇతరులను కూడా చంపుతూ' ఉంటాడు.

సత్వగుణం ఉన్న వ్యక్తిలో ప్రేమ, దయ, జాలి కరుణ, ఆప్యాయత, అభిమానం, సేవాభావం, బాధ్యతగా మెలగడం, ఇతరులకు సాయపడాలనే తపన, మంచి మనసు, ఇతరుల మనసు నొప్పించకుండుట, ఆదర్శ వంతంగా ఉండటం, విశాలహృదయం, క్రమశిక్షణతో మెలగడం, త్రికరణ శుద్ధితో ఉండటం, మానవత్వంతో మెలగడం, ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉండటం వంటి లక్షణాలను కలిగి ఉంటాడు. అతడు తన ఇంటికే కాదు, ఈ సమాజానికి, ప్రపంచానికి ఉపయోగపడే విలువైన పనులనే చేస్తాడు. అలాంటి వారికి "విలువ " అనేది అతడు పిలవకుండానే అతడి దగ్గరకు వస్తుంది.

కాబట్టి తమోగుణాన్ని వీడి, రజోగుణాన్ని కరిగించి, శుద్ద సత్వగుణంలోకి ప్రవేశించి మానవత్వంతో జీవిస్తూ అందరికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తూ మంచి విలువలతో కూడిన విలువైన జీవితాన్ని గడుపుదాం...

ఓం శాంతి🙏🏻

Source - Whatsapp Message

No comments:

Post a Comment