Friday, October 9, 2020

నేటి ఆత్మ విచారం

💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

🌹నేటి ఆత్మ విచారం 🌹

విచారణ ఆగిపోయినప్పుడు భగవద్దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి నోటమాట రాకుండా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ,

థియేటర్ కు వెళ్ళాక జనులు ఎన్ని రకాల మాటలు మాట్లాడుతుంటారు! కానీ, ఒకసారి తెర లేవగానే మాటలన్నీ ఆగిపోతాయి. రంగస్థలంపై తాము చూస్తున్న దృశ్యాలలో లీనమైపోతారు...

మనస్సుతో విచారణ చేస్తున్నంత కాలం జగత్తును వదిలించుకోలేము. నిత్యాన్ని చేరలేము. విచారణ ఆగిపోయినప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మను ఆత్మద్వారా మాత్రమే సాక్షాత్కరించుకోగలం.

ఒక వస్తువును చూడాలంటే కళ్ళు ఉండాలి, వెలుతురు ఉండాలి, మనస్సు ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ వస్తువును చూడలేము. ఈ మనస్సు పని చేస్తున్నంతసేపు "జగత్తు లేదు ", "నేను అనేది లేదు " అని ఎలా చెప్పగలం...?

మనస్సు నశించిపోయినప్పుడు, సంకల్పాలు అన్ని తొలగిపోయినప్పుడు సమాధిస్థితి కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం లభిస్తుంది..

ఇనుము అయస్కాంతం ఆకర్శించే తీరులో భగవంతుడు మనలను సర్వధా ఆకర్షిస్తున్నాడు. కానీ ఇనుము మట్టిచే కప్పబడినప్పుడు అయస్కాంతం దానిని ఆకర్శించదు. మట్టిని కడిగివేసిన మరుక్షణమే అయస్కాంతం, ఇనుమును ఆకర్షిస్తుంది.భగవంతునికై విలపించు. కన్నీరు నీ మనస్సులోని మాలిన్యాన్ని కడిగివేస్తుంది..

సంసారంలో ఉన్నంత కాలం మీ బాధ్యతలన్నీ ఆయన పరం చేయండి. ఆయన ఇచ్చ మేరకు నిర్వర్తిస్తాడు .మన ఇంటి యజమాని అతడే యెరుగుము.

ధనవంతుని ఇంటి దాసిలాగా ఈ సంసారంలో జీవించండి. ఆమె తన యజమాని పిల్లలకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది, వాత్సల్యంతో అనేక విధాలుగా వారిని చూసుకుంటుంది. వారు తన సొంత పిల్లలన్నట్లు. కానీ వారు తన పిల్లలు కారనే విషయం ఆమెకు బాగా తెలుసు.

భగవంతుడితో శాశ్వతంగా తనను బందించుకోవడానికై భక్తుడి చేతిలో ఉండే దారమే "ప్రేమ " అతడు పిలిచేటప్పుడల్లా భగవంతుడు అతడి వద్దకు వస్తాడు..

ఆత్మీయ మిత్రులకు శుభోదయం🙏

🌻సర్వేజనాః సుఖినోభవంతు.🙏

🕉 జై యోగేశ్వర్.🕉

💫 మీ..డా,, తుకారాం జాదవ్ , 🙏

💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

Source - Whatsapp Message

No comments:

Post a Comment