అర్జునా....
మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ...
అవి అన్నీ మట్టి తోటే తయారు చేయబడతాయి.
అలానే జీవుల శరీరాలు వేరైనా...
వాటిలో ఉండేది ఒకే ఆత్మ.
ఈ విషయం తెలుసుకున్న వారు ఎవరూ...
ఎవరినీ బాధ పెట్టరు.
ఎవరి చేతనూ బాధింపబడరు.
ఒకసారి కుండను ఎవరో అడిగారట...
నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా...
ఇది ఎలా సాధ్యం? అని.
అప్పుడు కుండ...
నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను...
నేను వచ్చింది మట్టిలో నుంచి...
వెళ్ళేది మట్టిలోనికే...
మధ్యలో ఆవేశం,
గర్వం,
అహం
అవసరమా?
అని చల్లగా జవాబిచ్చింది.
నాది అనుకుంటే బాధ్యత అవుతుంది...
నాకెందుకు అనుకుంటే...
బరువు అవుతుంది.
స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి.
వెలిగించడం చాలా సులభం...
కానీ ఆరిపోకుండా కాపాడుకోవడం లోనే ఉంది అసలైన గొప్పతనం...
కష్టం విలువ తెలిసినవారు ఎవరినీ కష్ట పెట్టరు.
ఇష్టం విలువ తెలిసినవారు ఎవరినీ వదిలిపెట్టరు.
లోపాలనే పట్టుకుని వేలాడితే...
బంధాలు ఎప్పటికీ మెరుగవ్వవు.
మన మనస్సు విశాలం చేసుకున్న కొద్దీ...
ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి.
ఐనా ఇష్టం ఉన్న బంధంలో ఏదీ కష్టం అనిపించదు.
ప్రేమ ఉన్న బంధం ఎప్పటికీ చెక్కుచెదరదు.
అవసరం ఉన్నప్పుడు పలకరిస్తున్నారని...
ఎవరి గురించీ బాధపడకు.
వాళ్లు చీకట్లో ఉన్నప్పుడు నువ్వు వెలుగులా గుర్తొస్తావని సంతోషించు.
సర్వేజనా సుఖినోభవంతుః...
జై శ్రీ కృష్ణా.....💐🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment