Sunday, December 6, 2020

మంచి మాటలు

మంగళవారం --: 27-10-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
మిత్రమా ! గతాన్ని గూర్చి ఆలోచించకు మనసు కలిచి వేస్తుంది , భవిష్యత్త్ గూర్చి ఆలోచించకు భయంవేస్తుంది చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు , సంతోషం నీ సొంత మవుతుంది .

ఎవ్వరు ఎంత హేళన చేసిన నీవు తొందర పడకు హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది ఓర్పుతో ఉండు నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది .

మనిషి పుట్టే వరకు తపన మనిషి పెరిగిన తర్వాత కోరిక మనిషి పద్దయ్యాక ఆశ మనిషి అభివృద్థి చెందాక ఆరాటం ఇలా ఎన్నో తిరని కోరికలు ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు ప్రారంభం ఎక్కడ అయినా ముగింపు మాత్రం చావుతోనే

మన కంటితో చూడని , చెవితో వినని వాటిని నమ్మొద్దు వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్దాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి .

సేకరణ *మీ .✒️.. AVB సుబ్బారావు 🌹🕉️🌷💐

Source - Whatsapp Message

No comments:

Post a Comment