Saturday, December 12, 2020

మంచి మాటలు

శుక్రవారం --: 11-12-2020

మనకు కష్టం వస్తే నవ్వే వారు శత్రువులు ధైర్యం చెప్పేవారు బంధువులు కళ్ళని తుడిచేవారు స్నేహితులు కానీ కనబడకుండా కంటతడి పెట్టేవారు తల్లిదండ్రులు .

నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తోక్కేవాళ్ళు ఉంటారు , నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు . కానీ! నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు , వాళ్ళని మీజీవితంలో ఎప్పటికి మర్చిపోకు .

మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఏలాంటి సమస్యకు అయిన పరిష్కారం దొరుకుతుంది , మనసుపెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదువితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది మనసుతో చేసే పనులు ఇంత మంచి వైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాకుండా కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకిస్తారు ఓ మనిషీ కాస్త ఆలోచించు .

మనల్ని అభిమానించే వాళ్ళకు మనం ఏ వివరణ ఇవ్వకపోయినా అర్ధం చేసుకుంటారు , అందుకే వాళ్ళకు సంజాయిషీలు చెప్పనవ సరం లేదు .ఇక మనల్ని అను మానించేవాళ్లు మనం ఎన్ని వివరణలిచ్చినా అపార్ధమే చేసుకుంటారు . అందుకే వాళ్లకు సంజాయిషీ చెప్పినా ఉపయోగం లేదు .

జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెఎడిపోవడం పడిపోవడం అంటూ ఏం ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది . కొందరు ఒడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు . ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా" ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడలో అని నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది .

నీ
కోసం నీ జీవితం మొత్తంలో నీకన్న ఎక్కువగా ఆలోచించే వారు నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒక్కరైనా ఉంటారు . నువ్వు తిరిగి ఏదో చేయాలని ఆశించచడం నువ్వు చేయాల్సిందల్లా మీపైన పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం ఇదే వారి జీవితకాలంలో నువ్విచ్చే విలువైన బహామతి .

సేకరణ ✒️
మీ ... AVB సుబ్బారావు 🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment