Saturday, December 12, 2020

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు కార్తీక గురువారపు శుభోదయ శుభాకాంక్షలు ,మీకు కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవుల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఎవరో మారాలి అని చూడకుండా మారదాం మార్పు కు మన నుండే శ్రీకారం చుడదాం ,ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా నేస్తమా 💐

గురువారం --: 10-12-2020 :--

ప్రేమగా పలకరిస్తే పరాయివాళ్ళు కూడా ఐనవాళ్ళు అవుతారు కఠినంగా మాట్లాడితే ఐనవాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్ధాం పోయేదేముంది మాటే కదా .

జీవితంలో గెలుపొటములు సహజం కుటుంబంలో గొడవలు కలహాలు , ప్రేమలు సహజం . అలాగే లోకంలో కష్టాలు . సుఖాలు సహజం ఇవి అన్ని ఆనందంగా ఎదురుకోవడమే.. మన మనిషి ధర్మం.

నా వల్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అని తెలిస్తే నాకు ఎంత కష్టం అయినా సరే వారికి దూరంగా ఉంటా ఎందుకంటే నా సంతోషంలో నేను ఓడిపోయినా వారి సంతోషంలో నేను కచ్చితంగా ఉంటా .

ఏది శాశ్వతం నీ వెనుక ఉన్న డబ్బా నీ మొహానికి ఉన్న అందమా నీతో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్ని నీకెలా శాశ్వతం అవుతాయి ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చావు ఒంటరిగా భూగర్భం లోకి పోతావు ఇదే శాశ్వతం .

ముక్కు సూటిగా ఉన్నట్టు మాట్లాడు చూడు నీ పక్కన ఒక్కడూ ఉండడు . అదే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవిలేనిది కల్పించి చెబుతూ మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది . అబద్ధాలకున్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు నిజమెప్పుడూ కఠోరమే .

సేకరణ ✒️*మీ ..AVB సుబ్బారావు 🌹🕉️🤝💐🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment