Saturday, October 9, 2021

నేటి మంచిమాట. సనాతనం నుండి సునాతనం

నేటి మంచిమాట. సనాతనం నుండి సునాతనం 🙊

సనాతన ధర్మం,మార్గం చూసాం.విన్నాం.సునాతన ధర్మం, మార్గం చూస్తున్నాం.ఇంకా చూస్తాం.ఎవరికి, ఎపుడు,ఎందుకు,ఎలా,ఎంత అవసరమో ఆ సృష్టికర్తకు భాగా తెలుసు.దీన్ని కోరాల్సిన పని లేదు.దాన్ని అందిపుచ్చుకో వాల్సింది మాత్రం మనమే.

అపుడెపుడో మా తాత గుర్రాన్ని ఎక్కి ఎక్కడికో వెళ్లే వాడట. పుష్పక విమానంలో ఎవరో, ఎటో వెళ్ళే వారట. ఇలా వుంటుంది మాటలలో వ్యవహారం.

ఇది ఇపుడు సాధ్యమేనా.ఆధునికతను అంది పుచ్చుకోవాలి.మార్పుని స్వాగతించాలి.మార్పుని అనుసరించాలి గమనించాలి.అదే జ్ఞానం అంటే.

కానీ ఎవరో, ఏదో,ఏమో అనుకుంటారని సమాజంలోని కొందరు వెనకడుగు వేస్తారు.ఉదాహరణకు ఈ రోజు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండగలమా? ఇలాంటివి ఇంకా ఎన్నో వున్నాయి గమనిస్తే.

మంత్ర యుగం విన్నాం,తంత్ర యుగం విన్నాం,చదివాం,తెలుసుకున్నాం.ఇపుడు యంత్ర యుగం చూస్తున్నాం.కానీ విచిత్రం ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు సత్యం మాత్రం మారలేదు.ధర్మమూ మారలేదు. కానీ అపుడపుడు కాస్తా మారుతున్నట్టు అనిపిస్తుంది ధర్మం.లోతుగా అధ్యయనం చేసి,ఇంకా పరిశీలిస్తే గానీ అది అర్థమవుతుంది.

ఇపుడు మనం చేయాల్సింది,చేస్తున్నదీ అదే. శ్వాస మీద ద్యాస.ధ్యానం.మౌనం.సత్యం...ఎంత ఆనందంగా వుందో కదా. అవును కావాల్సింది అదే.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment